Ration Card: అక్కడి ప్రజలకి రేషన్‌కార్డు ఉంటే రూ.500లకే గ్యాస్ సిలిండర్..!
Ration Card: గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
Ration Card: గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొంతమంది ధరలకి భయపడి సిలిండర్ వాడటమే మానేశారు. అలాంటి వారికోసం రాజస్థాన్ ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయంతో ముందుకు వస్తోంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు సగం ధరకే సిలిండర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎవరు ప్రయోజనం పొందుతారు?
గ్యాస్ సిలిండర్లను సగం ధరకే ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 2023 నుంచి రాష్ట్రం మొత్తం అమలులోకి రానుంది. బీపీఎల్ కార్డ్ హోల్డర్లు దీని ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. వారికి ఇప్పుడు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఉజ్వల పథకం కింద ప్రతి సంవత్సరం 12 సిలిండర్లు అందుబాటులో ఉంటాయి.
ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే సీఎం అశోక్ గెహ్లాట్ అభివృద్ధి పనుల ప్రచారానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పేదలను ఆదుకునేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం 12 సిలిండర్లను పంపిణీ చేస్తుంది. ఇది నిరుపేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
జనవరి 1 న సిలిండర్ ధరలు పెరిగాయి
జనవరి 1, 2023 నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. అదే సమయంలో గృహ గ్యాస్ సిలిండర్ల ధరలు అలాగే ఉన్నాయి. అంటే డొమెస్టిక్ సిలిండర్ల కోసం గత నెలలో ఎంత మొత్తం ఖర్చు చేశారో అంతే మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ల కోసం రూ.25 అదనంగా ఖర్చు చేయనున్నారు.