Prepay Home Loan: హోమ్‌లోన్ ముందస్తుగా చెల్లిస్తున్నారా.. లాభ నష్టాలు భేరీజు వేయండి..!

Prepay Home Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం చాలామంది హోమ్‌లోన్‌ ఆధారపడుతారు.

Update: 2023-12-08 15:00 GMT

Prepay Home Loan: హోమ్‌లోన్ ముందస్తుగా చెల్లిస్తున్నారా.. లాభ నష్టాలు భేరీజు వేయండి..!

Prepay Home Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం చాలామంది హోమ్‌లోన్‌ ఆధారపడుతారు. ఎందుకంటే చాలా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు హోమ్‌లోన్స్‌ అందిస్తున్నాయి. దీంతో సులువుగా లోన్‌ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం, లేదా కట్టుకోవడం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ హోమ్‌లోన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. వడ్డీరేట్లు, ప్రీ పేమెంట్‌, ఈఎంఐ మొదలగు వాటి గురించి తెలుసుకోవాలి.

ఈ రోజుల్లో చాలామంది ఈఎంఐల భారం తగ్గుతుందని హోమ్‌లోన్‌ని ముందస్తుగా డబ్బులు చెల్లించి క్లోజ్ చేస్తున్నారు. దీనివల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. వాస్తవానికి హోమ్ లోన్లు ఎక్కువ కాలానికి ఈఎంఐలు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తుంది. అయితే అధిక వడ్డీ నుంచి తప్పించుకోవడానికి చాలామంది ముందుగనే చెల్లింపులు చేస్తారు. పైగా ఒకేసారి అప్పు చెల్లించినట్లయితే రిలాక్స్‌గా ఫీలవుతారు.హోమ్ లోన్‌ను ప్రీపే చేయడం అంటే లోన్ వ్యవధి ముగిసేలోపు తిరిగి చెల్లించేయడం. ఇది రుణ భారాన్ని తగ్గిస్తుంది.

అయితే హోమ్‌లోన్‌ ముందస్తుగా చెల్లిస్తే మంచిదే. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో రుణ భారాన్ని తగ్గిస్తుంది. వడ్డీ తగ్గుతుంది. అలాగే బ్యాంక్ అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్లయితే హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లించడం చాలా మంచిది. అయితే పొదుపు లేదా ఎమర్జెన్సీ ఫండ్‌లను నుంచి హోమ్ లోన్‌ని చెల్లించడం తెలివైన ఆలోచన కాదు. దీనివల్ల అత్యవసర సమయంలో ఇబ్బందిపడుతారు. హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లిస్తే సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కోల్పోతారు. గృహ రుణంపై చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ముందస్తు చెల్లింపు చేస్తే ఈ తగ్గింపులు వర్తించవు.

Tags:    

Similar News