Post Office: పోస్టాఫీసు బెస్ట్ స్కీం.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది..!
Post Office: చిన్న, మధ్య తరగతి ప్రజలకు పోస్టాఫీసు స్కీంలు బాగా సెట్ అవుతాయి. వాళ్ల పెట్టుబడులకు భద్రతతో పాటు మంచి ఆదాయం లభిస్తుంది.
Post Office: చిన్న, మధ్య తరగతి ప్రజలకు పోస్టాఫీసు స్కీంలు బాగా సెట్ అవుతాయి. వాళ్ల పెట్టుబడులకు భద్రతతో పాటు మంచి ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు పోస్టాఫీసు పథకాలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ భరోసా కూడా లభిస్తుంది. పోస్ట్ ఆఫీసు అనేక పథకాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్(టీడీ అకౌంట్) ఒకటి. దీనిలో అధిక వడ్డీ లభిస్తుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.
వడ్డీ ఎంత?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం(టీడీ అకౌంట్)లో మంచి వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్టంగా 5 సంవత్సరాల డిపాజిట్లపై 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో 1-3 సంవత్సరాల కాల వ్యవధిపై టీడీ చేస్తే మీకు 6.90 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. అదే డిపాజిట్ 5 సంవత్సరాలటెన్యూర్ పెట్టుకుంటే వడ్డీ 7.5 శాతం చొప్పున అందుతుంది.
డబ్బు రెట్టింపు కావాలంటే..
మీరు టైమ్ డిపాజిట్ స్కీమ్ లో డబ్బును ఐదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 7.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటుతో మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. ఆ విధంగా రెట్టింపు కావడానికి దాదాపు 9 సంవత్సరాల 6 నెలలు అంటే 114 నెలల సమయం పడుతుంది.ఉదాహరణకు.. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ, 7.5 శాతం, మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు మెచ్యూరిటీపై లభించే మొత్తం రూ. 7,24,974, వడ్డీ ప్రయోజనం రూ. 2,24,974 లభిస్తుంది.
టీడీ అకౌంట్ అర్హతలు..
టైమ్ డిపాజిట్ స్కీమ్ అకౌంట్‌ను భారతీయ సిటిజెన్ ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. 18ఏళ్ల పైనున్న వారు ఖాతాలు తెరవచ్చు. అదే పదేళ్ల లోపు పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు ఖాతాను ఓపెన్ చేయొచ్చు. అదే విధంగా ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఖాతాను తెరిచేటప్పుడు నామినేషన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే ముందస్తు విత్ డ్రా విషయంలో పెనాల్టీ విధిస్తారు.