PM Kisan: ఈ రైతుల నుంచి పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం.. కారణం తెలిస్తే షాక్..!
PM Kisan Money Recover: పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా మూడు విడుతల్లో జమా చేస్తోంది.

PM Kisan Money Recover: పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా మూడు విడుతల్లో జమా చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడుతలు పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం 20వ విడుత నిధుల కోసం రైతుల ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తోన్న నిధులను కొంత మంది నుంచి వెనక్కి తీసుకునే పనిలో పడింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI) నివేదిక ప్రకారం 2019 నుంచి పీఎం కిసాన్ నిధులు కేవలం ఆర్థికంగా వెనుకబడిన రైతులు మాత్రమే కాదు బడా రైతుల ఖాతాల్లో కూడా జమా అవుతున్నట్లు తెలిసింది.
పీఎం కిసాన్ నిధులు కేవలం చిన్న సన్నకారు రైతుల కోసం, వారి వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ప్రారంభించారు. అయితే, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న రైతులు కూడా పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రూ.3.68 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమా చేసింది.
బెనిఫిషియరీ లిస్ట్‌ను మానిటర్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అర్హులు కాని రైతుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.416 కోట్లను రికవర్ చేసింది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతు సంక్షేమ సంస్థల ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనలకు అర్హులు కాని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెంటనే రికవర్ చేయాలని ఆదేశించింది.
పీఎం కిసాన్ యోజనకు వీరు అర్హులు కాదు..
ఆదాయ పన్ను కడుతున్నవారు
పీఎస్‌యూ, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు,
సంస్థల యజమానులు,
మంత్రులు, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసేవారు. పంచాయితీ శాఖల్లో పనిచేసే రైతులు
రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు.
రూ.10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రైతులు కూడా పీఎం కిసాన్‌కు అర్హులు కాదు.