పెట్రోల్, డీజిల్ ధరలలో భారీ పెరుగుదల!

Update: 2019-09-18 03:19 GMT

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. రెండు నెలల తరువాత తొలిసారిగా ఎక్కువస్థాయిలో పెరుగుదల నమోదైంది. మంగళవారం తో పోలిస్తే బుధవారం పెట్రోల్ 27పైసలు, డీజిల్ 26పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.99 రూపాయలకు చేరింది. డీజిల్ 71.75 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి 76.71రూపాయలు గానూ, డీజిల్ ధర25 పైసలు పెరిగి 71.13రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.76.34, డీజిల్ ధర 25 పైసలు పెరిగిరూ.70.79 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 25పైసలూ, డీజిల్26 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 78.10రూపాయలు, డీజిల్ 69.04రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 25పైసలూ, డీజిల్24 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 72.42రూపాయలుగానూ, డీజిల్ ధర 65.82రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గాయి. పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 63.50 డాలర్లు గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 59.09 డాలర్లు గానూ ఉన్నాయి.


Tags:    

Similar News