పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరగడంతో .. సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 15పైసలు, డీజిల్ 16పైసలు పెరిగాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరగడంతో .. సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 15పైసలు, డీజిల్ 16పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.72 రూపాయలకు చేరింది. డీజిల్ 71.49 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి 76.45రూపాయలు గానూ, డీజిల్ ధర 15 పైసలు పెరిగి 70.88రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.76.08, డీజిల్ ధర 16 పైసలు పెరిగిరూ.70.54 రూపాయలకు చేరుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 14పైసలూ, డీజిల్16 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 77.85రూపాయలు, డీజిల్ 68.78రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 14పైసలూ, డీజిల్16 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 72.17రూపాయలుగానూ, డీజిల్ ధర 65.58రూపాయలుగానూ ఉంది.
ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 68.02 డాలర్లు (1.45 శాతం పెరుగుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 61.77 డాలర్లు (1.80 శాతం పెరుగుదల) గానూ ఉన్నాయి.