Shekhar Sharma: నాడు 10వేల జీతమని అమ్మాయిని కూడా ఇవ్వలేదు.. నేడు Paytm అధిపతి

*నాడు నెలకు 10 రూపాయల ఆదాయంతో ఒక సంస్థ స్థాపించి నేడు 18000 కోట్ల సంపాదనతో పేటియం అధిపతిగా నిలిచాడు.

Update: 2021-11-18 12:18 GMT

Shekhar Sharma: నాడు 10వేల జీతమని అమ్మాయిని కూడా ఇవ్వలేదు.. నేడు పేటియం అధిపతి

Vijay Shekhar Sharma: ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌ కి చెందిన ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన విజయ్ శేఖర్ శర్మ నెలకు 10 రూపాయల ఆదాయంతో మొదలుపెట్టిన ఒక చిన్న సంస్థ నుండి నేడు 18000 కోట్ల సంపాదనతో పేటియం అధిపతిగా నిలిచాడు. పేటియం అధినేత విజయ్ శేఖర్ శర్మ 2000 సంవత్సరంలో వన్ 97 అనే ఒక చిన్న కంపెనీని స్థాపించి టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించే సంస్థ నుండి కేవలం 10 ఏళ్ళలోనే పేటియం గా రూపాంతరం చెంది అనంతరం ఆన్లైన్ పేమెంట్స్ లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ వాలెట్ పేమెంట్ లైసెన్స్‌ పొందింది.

తాజాగా ఫోన్‌ రీఛార్జ్‌, కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు సులువుగా చేసుకునేలా పేటీఎంని అందుబాటులోకి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇలా పేటీఎం నెమ్మదిగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. కేవలం రెండేళ్లలోనే రెండున్నర లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అయితే ఇటీవల విజయ్ శేఖర్ శర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చదువు పూర్తయిన తరువాత మొదట ఒక చిన్న సంస్థ స్థాపించానని ఆ సమయంలో దాని నుండి 10 వేల రూపాయలు మాత్రమే ఆదాయం రావడంతో తాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదన్నాడు.

దాంతో కంపెనీ మూసేసి ఏదైనా 30 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చూసుకోవాలని తన తండ్రి సలహా ఇచ్చాడని తెలిపాడు. కాని తాను నమ్మిన రంగంలోని పెట్టుబడులు పెట్టానని, అది కాస్త 2010 లో పేటియం గా మారడం.. ఆ సంస్థలో చైనాకి చెందిన యాంటి గ్రూప్ చెందిన సంస్థ పెట్టుబడులు పెట్టడంతో కంపెనీ లాభాలు ఒక్కసారిగా పెరిగిపోయానని శేఖర్ వర్మ తెలిపాడు.   

Tags:    

Similar News