Onion Price: వేసవిలో పెరుగనున్న ఉల్లిధరలు.. కేంద్ర ప్రభుత్వ ప్లాన్ ఇదే

Onion Price: వేసవి మొదలైంది. మరి కొద్ది రోజుల్లో తీవ్రమవుతుంది. వేసవిలో ఉల్లిపాయలకు డిమాండ్ పెరుగుతుంది.

Update: 2025-03-23 06:49 GMT
Onion Price

Onion Price: వేసవిలో పెరుగనున్న ఉల్లిధరలు.. కేంద్ర ప్రభుత్వ ప్లాన్ ఇదే

  • whatsapp icon

Onion Price: వేసవి మొదలైంది. మరి కొద్ది రోజుల్లో తీవ్రమవుతుంది. వేసవిలో ఉల్లిపాయలకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దాని సరఫరా, ధరలను అదుపులో ఉంటాయా లేదా అని చాలా మందిలో డౌట్లు ఉన్నాయి. కారణం ప్రభుత్వం దేశం నుంచి ఉల్లిపాయలను ఎగుమతి చేయడాన్ని సులభతరం చేసింది. అందుకే వేసవిలో ఉల్లిపాయల ధరలు ఇప్పటిలాగే ఉంటాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉల్లిపాయల ఎగుమతిపై సుంకం ఉంది. దీని రేటు 20 శాతం. ఇప్పుడు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఉల్లిపాయ ఎగుమతిపై ఈ 20 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకునే నిర్ణయం గురించి ప్రభుత్వ అధికారిక ప్రకటనలో.. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం వినియోగదారుల శాఖ నుంచి లేఖ అందిన తర్వాతే, రెవెన్యూ శాఖ 20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో ఉల్లిపాయ ఎగుమతిపై ఈ సుంకాన్ని విధించింది.

"ఉల్లి రైతులకు వారి ఉత్పత్తులపై ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో, సాధారణ వినియోగదారులకు ఉల్లి ధరలను సరసంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది చూపిస్తుంది. రబీ పంట సమయంలో ఉల్లిపాయలు బాగా వస్తాయని భావిస్తున్నారు. అందువల్ల, ఉల్లిపాయల టోకు, రిటైల్ ధరలు తగ్గాయి" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సెప్టెంబర్ 2024 నుండి ఎగుమతి సుంకం అమలు చేసినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 18 వరకు దేశంలో ఉల్లిపాయ ఎగుమతులు 11.65 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 2024 సెప్టెంబర్‌లో నెలవారీ ఉల్లిపాయల ఎగుమతి 0.72 లక్షల టన్నులుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఇది 1.85 లక్షల టన్నులకు పెరిగింది. రబీ పంట సరఫరా పెరగడం వల్ల, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలలో ఉల్లి ధరలు పడిపోయాయి.

ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లిపాయ మార్కెట్లు అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్, పింపాల్‌గావ్‌లలో మార్చి 21న ధరలు వరుసగా క్వింటాలుకు రూ. 1,330, రూ. 1,325గా ఉన్నాయి. గత నెలలో అఖిల భారత స్థాయిలో ఉల్లిపాయల ధరలు సగటున 39 శాతం తగ్గాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. గత నెలలో ఉల్లిపాయల రిటైల్ ధర సగటున 10 శాతం తగ్గింది.

భవిష్యత్తులో కూడా ఉల్లిపాయలు చౌకగా ఉంటాయా?

రాబోయే నెలల్లో దేశంలో ఉల్లిపాయ ధరలు అదుపులో ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది రబీ పంటలో ఉల్లి ఉత్పత్తి 227 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇది గత సంవత్సరం 192 లక్షల టన్నుల కంటే 18 శాతం ఎక్కువ. భారతదేశ మొత్తం ఉత్పత్తిలో 70-75 శాతం వాటా కలిగిన రబీ పంట ఉల్లిపాయలు, అక్టోబర్-నవంబర్‌లో ఖరీఫ్ పంట సరఫరా ప్రారంభమయ్యే వరకు మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడానికి చాలా అవసరం.

Tags:    

Similar News