ట్రిపుల్ ప్లే సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్, యుప్ టీవీ సంస్థలు అవగాహనా ఒప్పందం

Update: 2019-10-21 07:57 GMT

ట్రిపుల్ ప్లే సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్, యుప్ టీవీ సంస్థలు అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వార్, యుప్ టీవీ వ్యవస్థాపకులు, సీఈఓ ఉదయ్ రెడ్డి ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యుప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ యుప్ టీవీ ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు చేరువ కానున్నాయన్నారు. దీని ద్వారా వీడియో ఎంటర్టైన్మెంట్ సర్వీసులు రెండు వందలకు పైగా లైవ్ టీవీ చానెల్స్, పది రోజుల కాచ్ అప్ టీవీ, 2500 పైగా సినిమాలు, రియల్ టైంలో ట్రెండింగ్ వీడియోస్, ఫస్ట్ డే ఫస్ట్ షో, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, యుప్ టీవీ ఒరిజినల్స్, పదికి పైగా భాషల్లో అపరిమిత వీడియో ఎంటర్టైన్మెంట్ సర్వీసులు అధునాతన టెక్నాలజీ తో వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు.

యుప్ టీవీ బీఎస్ఎన్ఎల్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, దేశంలోని ప్రతి ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ తన సేవలను అందిస్తుందన్నారు. 2007 లో యప్ టీవీ సంస్థ స్థాపించిన నాటి నుంచి అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ ఉన్న రోజుల్లోను యుప్ టీవీ సేవలందించిందని తెలిపారు. ఈ టీవీ ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు టీవీ సేవలు అందిస్తుందన్నారు. బీఎస్ఎన్ఎల్ తో కలిసి ట్రిపుల్ ప్లే సర్వీసులు ప్రజలకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసారు.

Tags:    

Similar News