MI Diwali Sales Offers: దీపావళి ఆఫర్ల హంగామా.. రూపాయికే స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ ఈ దీపావళికి భారీ ఆఫర్లతో ఆన్లైన్ లో సందడి చేయబోతోంది. ఒక్క రూపాయితో స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సెల్ తొ పాటు ప్రతి ఉత్పత్తి మీదా ఎన్నడూ లేని విధంగా ఆఫర్లు ప్రకటించబోతోంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ ఈ దీపావళికి భారీ ఆఫర్లతో ఆన్లైన్ లో సందడి చేయబోతోంది. ఒక్క రూపాయితో స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సెల్ తొ పాటు ప్రతి ఉత్పత్తి మీదా ఎన్నడూ లేని విధంగా ఆఫర్లు ప్రకటించబోతోంది. దాదాపు రెండు కోట్ల రూపాయల డిస్కౌంట్ కూపన్లు అందించనుంది షావోమీ. ఈ ఆఫర్లు షావోమీ యాప్ లోనే కాకుండా, ఫ్లిప్ కార్ట్-బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ - గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ లో కూడా దొరికే అవకాశం ఉంది.
దీవాలీ విత్ ఎంఐ..
దీవాలీని ఎంఐ తో జరుపుకొండి అంటోంది షావోమీ. ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోయే షావోమీ దీవాలీ అక్టోబర్ 4 వరకూ కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర షవోమీ ఉత్పత్తులు ఈ సేల్ లో అమ్మకానికి సిద్ధం కాబోతున్నాయి.
దీవాలీ గోల్డ్ రష్
ఈ సేల్ లో కేవలం తగ్గింపు ధరలు మాత్రమే కాకుండా.. వినియోగదారులు మరిన్ని షావోమి ఉత్పత్తులు గెలుచుకునేలా 'దీవాలీ గోల్డ్ రష్'అనే ఆటను కూడా ఆడవచ్చు. ఇందులో రూ.2 కోట్ల వరకు కూపన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఆటను ఎంఐ స్టోర్ యాప్ లో సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆడవచ్చు. అంతేకాకుండా షావోమి తన సంస్థకు చెందిన ఏవైనా రెండు ఉత్పత్తులను రోజులో ఒక్కసారి కేవలం రూ.1కే ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మనుంది. ఈ రూ.1 ఫ్లాష్ సేల్ ఆరు రోజుల పాటు జరగనుందని సంస్థ తెలిపింది.
మొట్టమొదటిసారి అమ్మకానికి...
ఈ సేల్ లో కొన్ని షావోమి ఉత్పత్తులు మొదటిసారి అమ్మకానికి రానున్నాయి. 65 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లను ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ ల్లో సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభించనున్నారు. దీని ధర రూ.54,999గా ఉంది. అలాగే 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ కూడా సెప్టెంబర్ 29 నుంచే ఎం.కామ్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో లభించనుంది. అంతేకాకుండా ఎంఐకు చెందిన 43 అంగుళాల, 40 అంగుళాల టీవీలు కూడా ఎంఐ.కామ్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ హోం స్టోర్లలో లభించనుంది. అన్ని ఎంఐ టీవీలూ ఆఫ్ లైన్ లో కూడా లభించనున్నాయి.
షావోమి నుంచి విడుదలైన మొదటి వాటర్ ప్యూరిఫయర్ ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫయర్లకు సంబంధించిన అమ్మకాలు కూడా ఎంఐ.కామ్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ హోంల్లో సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫిల్టర్ కార్ట్రిడ్జ్ లను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ.3,997గా నిర్ణయించారు.
ఆఫర్లు.. డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ లు..
ఈ ఆఫర్లే కాకుండా... ఎంఐ.కామ్ వెబ్ సైట్ లో హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ లో ఎస్ బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10 శాతం, ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది.