స్టాక్‌ మార్కెట్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు..!

ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Update: 2024-06-03 04:15 GMT

స్టాక్‌ మార్కెట్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు..!

Stock Market Today: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు అతి భారీ లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 1981.49 పాయింట్లు లాభంతో 75,942.80 పాయింట్లు నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. రెండు సూచీలూ ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను నమోదు చేయడం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ జోష్‌ కనిపించింది.

ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార బీజేపీ మళ్లీ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెప్పాయని, ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఉంటుందని ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో పెట్టుబడి సేవల ప్రాథమిక పరిశోధన హెడ్ నరేంద్ర సోలంకి అన్నారు.

Tags:    

Similar News