Maruti Suzuki: ఏప్రిల్ 1 నుంచి మారుతి వాహనాలు ఖరీదు.. చౌకగా రావాలంటే ఇప్పుడే బుక్‌ చేయండి..!

Maruti Suzuki: ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం వాహనాలకు కొత్త ఉద్గార నిబంధనలను అమలు చేస్తుంది.

Update: 2023-03-23 14:30 GMT

Maruti Suzuki: ఏప్రిల్ 1 నుంచి మారుతి వాహనాలు ఖరీదు.. చౌకగా రావాలంటే ఇప్పుడే బుక్‌ చేయండి..!

Maruti Suzuki: ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం వాహనాలకు కొత్త ఉద్గార నిబంధనలను అమలు చేస్తుంది. అందుకే నెమ్మదిగా అన్ని వాహన కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి ధరలు పెంచుతున్నాయి. తాజాగా ఏప్రిల్ 1, 2023 నుంచి మారుతి సుజుకి వాహనాలు ఖరీదుగా మారుతున్నాయి. ఒకవేళ చౌకగా కొనుగోలు చేయాలంటే ఈ వారంరోజులలో బుక్‌ చేసుకోవడం ఉత్తమం. కంపెనీ దాదాపు అన్ని మోడళ్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది.

వోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్ తర్వాత ఇప్పుడు మారుతి సుజుకి కూడా ఈ నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ధర ప్రభావితమవుతోందని అలాగే కొత్త నిబంధనలని దృష్టిలో ఉంచుకుని వాహనాల ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఒకవేళ వచ్చే నెలలో కొత్త మారుతి సుజుకి కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే చాలా ఖరీదు అవుతుంది. అందుకే ఏప్రిల్ 1, 2023లోపు కొత్త మారుతి కారును కొనుగోలు చేయడం ఉత్తమం.

మారుతి సుజుకికి చెందిన బాలెనో, బ్రెజ్జా, సియాజ్, ఇతర మోడళ్ల ధరలు వచ్చే నెల నుంచి పెరుగుతున్నాయి. అయితే ఈ వాహనాల ధరలను ఎంత మొత్తానికి పెంచవచ్చో ఇంకా స్పష్టంగా కంపెనీ ప్రకటించలేదు. ధర తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని అయితే వాహనాల ధరలను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని మారుతీ సుజుకీ చెబుతోంది.కార్ల తయారీదారులే కాదు బైక్‌ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ కూడా తన మోడళ్లను 2 శాతం ఖరీదైనదిగా చేయబోతున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News