Nestle India: మ్యాగీ ప్రియులకి ఊహించని షాక్..!
Nestle India: ఆకలిగా ఉంటే తొందరగా అయ్యే వంటకం ఏదైనా ఉంటే అది మ్యాగీ. పిల్లలు,పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు.
Nestle India: ఆకలిగా ఉంటే తొందరగా అయ్యే వంటకం ఏదైనా ఉంటే అది మ్యాగీ. పిల్లలు,పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు. ఇప్పుడు వీటిని తినాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్ ధరల్ని పెంచింది. ఇప్పుడు సామాన్యులకి మరింత భారం కానున్నాయి. వాస్తవానికి నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస‍్తున్న కిట్ కాట్, నెస్‌కెఫే కాఫీ ధరలు కూడా పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా తెలిపింది.
పెట్రోల్, గ్యాస్, రవాణా ఛార్జీల ఎఫెక్ట్ దీనిపైన కూడా పడింది. ముడి సరుకు,ఫ్యూయల్, ట్రాన్స్ పోర్ట్, వర్క్‌ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్ల మ్యాగీ ధరలు వరుసగా పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నెస్లే సీఈఓ ష్నీడర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెరుగుతున్న ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తుల ధరల్ని పెంచడం అనివార్యమైంది. 140 గ్రాముల మ్యాగీ ప్యాకెట్ ధర రూ.12 నుంచి రూ.14 పెరగనుంది. రూ.96 ప్యాకెట్ ధర రూ.105లకు పెరగనుంది.
ఇక దేశంలో అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG ) కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL ) టీ, కాఫీ పౌడర్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ బ్రూ కాఫీ పౌడర్ ధరను 3-7 శాతం వరకు పెంచింది. తాజ్ మహల్ టీ ధర 3.7-5.8 శాతం పెరిగింది. హెచ్‌యూఎల్ ఫిబ్రవరిలో రెండుసార్లు డిటర్జెంట్ పౌండర్, సబ్బుల ధరను పెంచింది. ఫిబ్రవరిలో HUL లైఫ్‌బాయ్, లక్స్, పియర్స్ సబ్బులతో పాటు సర్ఫ్ ఎక్సెల్ మాటిక్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్ వంటి బ్రాండ్‌ల స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలను కూడా మరింత పెంచింది.