LIC: రోజుకు రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే రూ. 25 లక్షలు పొందొచ్చు..!

పెట్టిన పెట్టుబడికి సెక్యూరిటీతో మంచి రిటర్న్స్ సైతం లభిస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో ఎల్‌ఐసీ ఒకటి.

Update: 2024-06-18 07:56 GMT

LIC: రోజుకు రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే రూ. 25 లక్షలు పొందొచ్చు.. 

LIC: ప్రస్తుతం ప్రజల ఆరోలచనలో మార్పు వచ్చింది. సంపాదించే దాంతో ఎంతో కొంత ఆదాయం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వచ్చే ఆదాయానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు బాట పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ అందిస్తుండడంతో చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

పెట్టిన పెట్టుబడికి సెక్యూరిటీతో మంచి రిటర్న్స్ సైతం లభిస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో ఎల్‌ఐసీ ఒకటి. ఒకప్పుడు ఎల్‌ఐసీ అంటే కేవలం వయసు పెరిగిన వారు మాత్రమే తీసుకునే వారు, కానీ ప్రస్తుతం భవిష్యత్తు గురించి ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఎల్‌ఐసీ వంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. కస్టమర్ల అభిరుచుకుల అనుగుణంగా సంస్థలు సైతం రకరకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఎల్‌ఐసీ అందిస్తోన్న అలాంటి బెస్ట్‌ పథకాల్లో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరుతో మంచి పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ ప్రీమియం చెల్లిస్తూ అధిక రిటర్న్స్‌ పొందడం ఈ ప్లాన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇది ఒక టర్మ్‌ పాలసీ. పాలసీ పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీలో రోజుకు 45 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1358 రూపాయలవుతుంది.

ఈ పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి చేతికి ఏకంగా రూ. 25 లక్షలు వస్తాయి. ఈ పాలసీ కాల వ్యవధి 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లుంటుంది. రోజుకు 45 రూపాయల చొప్పున 35 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఒకేసారి 25 లక్షల రూపాయల భారీ మొత్తం అందుతుంది. ఈ లెక్కన మీరు ఏడాదికి పెట్టుబడిగా పెట్టేది రూ. 16,300. అంటే నెలకు కేవలం రూ. 1358 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 16,300. 35 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసేది రూ. 5,70,500 మాత్రమే. ఫైనల్ బోనస్ 11.509 లక్షలుంటుంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కచ్చితంగా 15 ఏళ్లకు చేయాల్సిందే. 

Tags:    

Similar News