LIC: ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ. 10వేలు రావాలా.? బెస్ట్‌ స్కీమ్‌..!

LIC: ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి స్కీమ్‌ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.

Update: 2024-06-20 12:30 GMT

LIC: ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ. 10వేలు రావాలా.? బెస్ట్‌ స్కీమ్‌.. 

LIC: ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉద్యోగంలో చేరిన తొలిరోజే పదవి విరమణ తర్వాత జీవితం ఎలా ఆలోచన పెరుగుతోంది. దీంతో రకరకాల పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు రిటర్మైంట్‌ తర్వాత నెలకు ఎంచ్కా రూ. 10వేలకు పైగా ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఈ పథకం పేరు ఏంటి.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి స్కీమ్‌ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ స్కీంలో పాలసీహోల్డర్లకు సింగిల్ లైఫ్ యాన్యుటీ, డిఫర్డ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పథకంలో మీరు ముందుగానే ముందుగానే సింగిల్ ప్రీమియం చెల్లించి.. ఆపైన యాన్యుటీ పేమెంట్స్ రూపంలో రెగ్యులర్ పేమెంట్స్ అందుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగానే ఈ పేమెంట్లను 2 విధాలుగా పొందొచ్చు. సింగిల్ లైఫ్ యాన్యుటీ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లలో ఒకటి సెలక్ట్ చేసుకోవచ్చు.

ఈ పాలసీ తీసుకోవడానికి మీ వయసు కనీసం 30 ఏళ్లు ఉండాలి. 79 ఏళ్లు పైబడిన వారికి ఛాన్స్‌ ఉండదు. ఈ పథకంలో కనీసం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ప్రతినెల వచ్చే పెన్షన్‌ అనేది పాలసీహోల్డర్‌ వయసు, పెట్టుబడిన పెట్టిన మొత్తం, వాయిదా వ్యవధిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్‌ తీసుకొని 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపుల్లి వాయిదా వేస్తే మీకు 13వ సంవత్సరం తర్వాత ఏడాదికి అందే పెన్షన్‌ రూ. 1,32,920 అవుతుంది. ఈ లెక్కన మీకు నెలకు రూ. 10వేలు చేతికి వస్తాయి.

పాలసీ దారుడు జీవించి ఉన్నంత కాలం సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ చేస్తుంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకుంటే.. మీరు, మీ లైఫ్ పార్ట్‌నర్ ఇద్దరిలో ఒకరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు, పాలసీదారులకు ఏమైనా జరిగితే.. నామినీలు పలు ఆప్షన్లతో బెనిఫిట్స్ పొందొచ్చు.

Tags:    

Similar News