రూ. 3,899కే సరికొత్త స్మార్ట్ ఫోన్
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు, వినియోగదారులకు అందుబాటు ధరలో లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు, వినియోగదారులకు అందుబాటు ధరలో లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. తన బ్రాండ్ నుంచి 'లావా జెడ్ 41'పేరుతో అత్యాధునిక ఫీచర్స్ తో మంగళవారం ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా, యూట్యూబ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సపోర్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేసారు.
ఈ ఫోన్ ను మిడ్‌నైట్ బ్లూ, యాంబర్ రెడ్ రంగుల్లో వినియోగదారులకు అందించనున్నారు. దీని ధర కూడా కేవలం రూ. 3,899గా నిర్ణయించారు. ఇంత వరకు ఏ స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్స్తో లభించలేదని ఆ సంస్థ ప్రతినిధి తేజిందర్ సింగ్ తెలిపారు.
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే దాని డిస్‌ప్లే 5 అంగుళాలు, కెమెరా 5 ఎంపీ, బ్యాటరీ బ్యాకప్ 2500 ఎంఏహెచ్,మెమొరీ 1 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ వర్షన్ గా రూపొందించారు.