SCSS VS SCFD: సీనియర్‌ సిటిజన్లకి అలర్ట్‌.. ఈ రెండు స్కీమ్‌ల మధ్య తేడా తెలియకుంటే నష్టపోతారు..!

SCSS VS SCFD: ఈ రోజుల్లో సీనియర్‌ సిటిజన్లకి అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Update: 2023-09-13 14:30 GMT

SCSS VS SCFD: సీనియర్‌ సిటిజన్లకి అలర్ట్‌.. ఈ రెండు స్కీమ్‌ల మధ్య తేడా తెలియకుంటే నష్టపోతారు..!

SCSS VS SCFD: ఈ రోజుల్లో సీనియర్‌ సిటిజన్లకి అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్‌ తర్వాత అధిక వడ్డీ ఎందులో వస్తుందో ఆ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ వయసులో చాలామంది సురక్షితమైన పెట్టుబడులని కోరుకుంటారు. అందుకే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), అలాగే సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌( SSFD) స్కీమ్‌లని ఎంచుకుంటారు. ఈ రెండు స్కీమ్‌లలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. కానీ ఇవి చాలామందికి తెలియవు. వీటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

SCSS రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్

SCSS అనేది రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లాన్. ఇది 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మంచి రాబడిని పొందడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్ FD అనేది మెరుగైన వడ్డీ రేట్లతో లభించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం. SCSS, SSFD రెండింటిలోనూ లాక్-ఇన్ వ్యవధి ఒకేలా ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. దీని కారణంగా వాటి ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

ఇది ప్రభుత్వ సపోర్ట్‌తో కూడిన పెట్టుబడి పథకం. కాబట్టి సురక్షితమైన పెట్టుబడి పథకంగా చెప్పవచ్చు. 1961లోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీని పొందవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. కానీ మరో మూడు సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. SCSS ఖాతాను ఓపెన్ చేయడం చాలా సులభం. దేశంలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసుకి వెళ్లి ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. అదేవిధంగా ఖాతాను దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్రాంచ్‌కైనా బదిలీ చేయవచ్చు.ఈ పథకం కింద కనీస డిపాజిట్ రూ.1,000. తర్వాత మొత్తాన్ని రూ1,000 గుణిజాలలో పెంచుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి

సాధారణ ఎఫ్‌డితో పోలిస్తే సీనియర్ సిటిజన్‌లకు బ్యాంకులు ప్రత్యేక వడ్డీని చెల్లిస్తాయి. సాధారణంగా బ్యాంకులు వృద్ధ కస్టమర్లకు 0.5 శాతం అదనపు వడ్డీని అందిస్తాయి. పెట్టుబడిదారులు వడ్డీ మొత్తాన్ని పొందడానికి వివిధ ఎంపికలను ఎంచుకోవచ్చు. ఈ ఎంపికలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా ఉంటాయి. ప్రతి నెలా వడ్డీ తీసుకోవడం ద్వారా నెలవారీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కొన్ని FDలపై పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

రెండింటి మధ్య వ్యత్యాసం

1. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తున్నారు. ఇది సెక్షన్ 80C కింద కవర్ అవుతుంది. ఇది కాకుండా ఐదేళ్ల లోపు FDలో పెట్టుబడి పెడితే మీకు ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు.

2. ఈ రెండింటి మధ్య రెండవ వ్యత్యాసం ఏంటంటే SCSS కింద గరిష్ట పెట్టుబడి పరిమితి ఉంటుంది. FDలో అలాంటి పరిమితి ఉండదు. ఇది కాకుండా FD అనేక ఎంపికలతో వస్తుంది.

3. ఈ రెండు పెట్టుబడి ఎంపికలలో దేనిని ఎంచుకోవాలి అనే నిర్ణయం పెట్టుబడిదారుడి ఆర్థిక లక్ష్యాలు, అతని వద్ద ఉన్న డబ్బుపై ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News