అన్నదాతలకి మరింత అండగా.. డిజిటల్‌గా మారుతున్న కిసాన్ క్రెడిట్ కార్డు..!

అన్నదాతలకి మరింత అండగా.. డిజిటల్‌గా మారుతున్న కిసాన్ క్రెడిట్ కార్డు..!

Update: 2022-09-07 04:15 GMT

అన్నదాతలకి మరింత అండగా.. డిజిటల్‌గా మారుతున్న కిసాన్ క్రెడిట్ కార్డు..!

KCC Digitise: రూరల్ ఏరియాలోక్రెడిట్ డెలివరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త పథకానికి నాంది పలికింది. దీనికోసం కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను (KCC) డిజిటలైజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా మధ్యప్రదేశ్, తమిళనాడులో కెసిసి డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ఫలితాలని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ డిజిటలైజేషన్ రుణ ప్రక్రియని మరింత సమర్థవంతంగా చేయడం, రుణగ్రహీతల వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రుణం కోసం దరఖాస్తు చేయడం నుంచి దాని పంపిణీకి పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని ఆర్‌బిఐ చెబుతోంది. నాలుగు వారాల సమయాన్ని రెండు వారాలకు తగ్గించవచ్చు. RBI ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, అనుబంధ పరిశ్రమల ఆర్థిక అవసరాలను తీర్చడం వల్ల రైతులను ఆర్థికంగా ఆదుకోవచ్చని తెలిపింది.

పైలట్ ప్రాజెక్ట్ కింద మధ్యప్రదేశ్, తమిళనాడులోని ఎంపిక చేసిన జిల్లాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంక్‌తో కలిసి అమలు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నాయి. రైతులకు సులువుగా ఆర్థికసాయం అందించాలనే ఉద్దేశంతో 1998లో కేసీసీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రుణాలు అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్, 2020లో సవరించిన KCC పథకాన్ని ప్రారంభించారు. దీనిలో రైతులకు సకాలంలో రుణ మద్దతు అందించడానికి ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News