PAN-Aadhaar: అలర్ట్.. పాన్-ఆధార్‌కు సంబంధించి ఈ విషయాలను ఫాలో అవుతున్నారా.. లేదంటే ఇబ్బందులే..!
PAN-Aadhaar: భారతదేశంలో ఒక వ్యక్తికి పాన్ కార్, ఆధార్ కార్డ్ రెండు కీలక పత్రాలుగా మారిపోయాయి.
PAN-Aadhaar: భారతదేశంలో ఒక వ్యక్తికి పాన్ కార్, ఆధార్ కార్డ్ రెండు కీలక పత్రాలుగా మారిపోయాయి. అదే సమయంలో, డిజిటలైజేషన్ ఊపందుకోవడంతో, ఆన్‌లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగిపోతున్నాయి. ఇటీవల, పలువురు ప్రముఖుల కార్డులను దుర్వినియోగం చేసినట్లు సమాచారం కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి కొన్ని విషయాలను తప్పక పాటించాలి.
ఆధార్-పాన్ దుర్వినియోగాన్ని నివారించడం ఎలా?
1) మీ పాన్, ఆధార్‌ని ప్రతిచోటుకు తీసుకెళ్లడం మానుకోండి. బదులుగా, సాధ్యమైన చోట, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ID వివరాలను ఉపయోగించాలి.
2) మీ పాన్, ఆధార్ వివరాలను ప్రామాణికమైన వ్యక్తులు లేదా కంపెనీలతో మాత్రమే పంచుకోండి. తేదీతో వాటి ఫోటోకాపీపై సంతకం చేయండి.
3) సోషల్ మీడియాతో సహా ఆన్‌లైన్ పోర్టల్‌లలో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయడం మానుకోండి. మీ పాన్‌ను ట్రాక్ చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు.
4) మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
5) మీ ఫోన్ గ్యాలరీలో పాన్, ఆధార్‌ను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఫోన్ పోయినట్లయితే వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
పాన్ కార్డ్ మోసపూరితంగా ఉపయోగించారా లేదా ఎలా తెలుసుకోవాలి?
దీని కోసం CIBIL నివేదికను తనిఖీ చేయండి. నివేదికలో అన్ని రుణాలు, క్రెడిట్ కార్డులు ఉంటాయి. CIBIL నివేదికలో మీకు అందని క్రెడిట్ కార్డ్ లేదా లోన్ ఏదైనా కనుగొనబడితే, వెంటనే అధికారులకు తెలియజేయండి.
PAN దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి?
TIN NSDL అధికారిక పోర్టల్‌కి వెళ్లండి.
హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగాన్ని క్లిక్ చేయాలి. ఇందులో డ్రాప్-డౌన్ మెను ఓపెన్ అవుతుంది.
- డ్రాప్-డౌన్ మెను నుంచి 'ఫిర్యాదులు/ప్రశ్నలు' ఆఫ్షన్‌కు వెళ్లాలి. ఇప్పుడు ఫిర్యాదు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
ఫిర్యాదు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, 'సబ్మిట్'పై క్లిక్ చేయాలి.