JioTV Plans: గుడ్‌న్యూస్.. 14 ఓటీటీలతో జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్.. ధరెంతో తెలుసా?
JioTV Premium Plans: Jio యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చింది. JioTV కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించింది. ఒకే ప్లాన్‌లో గరిష్టంగా 14 విభిన్న OTT యాప్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు.
JioTV Premium Plans: Jio యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చింది. JioTV కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించింది. ఒకే ప్లాన్‌లో గరిష్టంగా 14 విభిన్న OTT యాప్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో జియో టెలికాం JioTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ఆవిష్కరించింది. ఇందులో నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి. నెలవారీ ప్లాన్ రూ. 398లతో ప్రారంభం అవుతుంది. ఇందులో అపరిమిత డేటా, వాయిస్, SMS ప్రయోజనాలను అందిస్తుంది.
కాల్‌లు, SMSలతో పాటు, వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో JioTV యాప్ ద్వారా Disney+ Hotstar, Amazon Prime వీడియో, Sony Liv, Zee5, ఇలా ఎన్నో ఓటీటీలను యాక్సెస్ చేయవచ్చు. ఈరోజు అంటే డిసెంబర్ 15 నుంచి జియో కస్టమర్లకు కొత్త ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ప్లాన్‌లు 100 SMS సందేశాలతో పాటు రోజుకు 2GB డేటాను అందిస్తాయి.
Jio కొత్త ప్లాన్‌లో రూ. 398, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లు వరుసగా 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. ఇందులో అపరిమిత డేటా, వాయిస్, SMS ప్రయోజనాలు, ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 14 OTTలు అందించనున్నాయి. JioCinema Premiumలో Disney+ Hotstar, Sony Liv, Zee5, Amazon Prime వీడియో, Docubay, డిస్కవరీ+ (మొబైల్ ఎడిషన్), లయన్స్‌గేట్ ప్లే, SunNXT, Hoichoi, Planet Marathi, Chaupal, EpicOn, Kanccha Lanka లాంటి ఓటీటీలు JioTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో రానున్నాయి.
రూ. 398 ప్లాన్‌లో 12 OTT యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్‌లు 14 OTT యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. Jio ఒక సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ కోసం EMI ఆఫ్షన్‌ను కూడా అందించింది. JioTV ప్రీమియం Jio SIM వినియోగదారులకు ప్రత్యేకమైనది. ఇంకా, రూ. 28 రోజుల పాటు 10GB డేటా, JioTV ప్రీమియం (12 OTTలు)తోపాటు 148 డేటా యాడ్-ఆన్ వోచర్ కూడా విడుదల చేసింది.
JioTV ప్రీమియం ప్లాన్‌లు డిసెంబర్ 16 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా JioTV ప్రీమియం ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత వినియోగదారులు ప్రీమియం OTT కంటెంట్‌ని ఉపయోగించడానికి అదే Jio మొబైల్ నంబర్‌తో JioTV యాప్‌కి సైన్ ఇన్ చేసుకోవచ్చు.