Stock Market: బుల్ జోరు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం తొలి సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభిస్తూ భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1128 పాయింట్లు మేర జంప్ చేయగా నిఫ్టీ 14,850 మార్క్ దిగువకు చేరాయి. అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు, యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1128 పాయింట్లు ఎగసి 50,136 వద్దకు చేరగా, నిఫ్టీ 337 పాయింట్లు మేర లాభంతో 14,845 వద్ద స్థిరపడ్డాయి.