Indian Railway: ఇండియన రైల్వే సరికొత్త ఆలోచన.. పట్టాలెక్కనున్న తొలి డబుల్ డెక్కర్.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Indian Railway: దేశంలో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ప్రయాణీకులు పై డెక్‌లో కూర్చొని ప్రయాణింస్తుంటారు.
Indian Railway: దేశంలో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ప్రయాణీకులు పై డెక్‌లో కూర్చొని ప్రయాణింస్తుంటారు. దిగువ కంపార్ట్‌మెంట్‌లో లగేజీలు రావాణా చేస్తుంటారు. అంటే, ఒకే రైలులో రెండు రకాల పని జరగనుంది. ప్రయాణీకులతోపాటు వస్తువుల రవాణా ఏకకాలంలో జరగనుందన్నమాట. ఈ డబుల్ డెక్కర్ రైలును రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కపుర్తలాలో తయారు చేస్తున్నారు. బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్‌తో నడిచే ఈ రైళ్ల కోచ్‌ల ట్రయల్ రన్ ఈ నెలాఖరులోపు జరగనుంది. మొదట్లో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను రూపొందించే యోచనలో ఉంది. రైలు ఎగువ కోచ్‌లో 46 మంది ప్రయాణికులకు స్థలం ఉంటే, దిగువ కంపార్ట్‌మెంట్‌లో 6 టన్నుల వరకు సరుకులు వచ్చే అవకాశం ఉంది.
ఈ టూ-ఇన్-వన్ డబుల్ డెక్కర్ రైళ్లను నడపాలన్న సూచన కరోనా మహమ్మారి సమయంలో వచ్చిన ఇబ్బందుల నుంచి ఆలోచించినట్లు తెలిపారు. మూడు డిజైన్లను రైల్వే బోర్డుకు సూచించినట్లు కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారి ఒకరు తెలిపారు. అందులో ఒకటి పాస్ అయిందంట. ఒక కోచ్ నిర్మాణానికి రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో మొదటి కార్గో లైనర్ రైలును తయారు చేస్తున్నట్లు RCF కపుర్తలా జనరల్ మేనేజర్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. ఈ నెలలోనే ఈ రైలు కోచ్‌ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందంట. ఈ రైలు డిజైన్ చాలా ప్రత్యేకమైనదని, ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్‌గా ఉంటుందని అగర్వాల్ చెప్పారు. ఈ రైలు కోచ్‌కు సంబంధించిన నమూనాను త్వరలో తయారు చేస్తామని అగర్వాల్ చెప్పారు. ఆ తర్వాత అది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు ట్రయల్ కోసం పంపబడుతుంది. ట్రయల్ విజయవంతమైతే RCF, కోచెస్‌లను తయారు చేస్తుంది.
ఒక రైలులో 20 కోచ్‌లు ఉంటాయని
రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు కార్గో లైనర్ కాన్సెప్ట్‌తో రూపొందించబడతాయి. క్రమం తప్పకుండా షెడ్యూల్ చేసిన మార్గాల్లో నడుస్తాయి. ఈ రైలులో వివిధ రకాల వస్తువులను తీసుకెళ్లవచ్చు. ఈ డబుల్ డెక్కర్ రైలు రెండు స్టేషన్ల మధ్య ఆర్డర్‌లను స్వీకరించే అన్ని వస్తువులను తీసుకువెళుతుంది. ప్రయాణికులు కూడా కలిసి ప్రయాణం చేయనున్నారు.
పార్శిల్ డెలివరీపై దృష్టి..
ఈ దశ పార్శిల్‌ను డెలివరీ చేయడంలో గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుందని, వస్తువులను సమయానికి డెలివరీ చేయవచ్చని నమ్ముతారు. ఇప్పటి వరకు ప్రయాణీకుడు ముందుగా చేరుకోవడం, అతని వస్తువులు కొన్ని రోజుల తర్వాత స్టేషన్‌కు చేరుకోవడం జరుగుతుంది. దీంతో సకాలంలో సరుకులు అందకపోవడంతో సమయం వృథాతో పాటు అదనంగా ఖర్చులు కూడా కలిసివస్తావని తెలిపారు.