చైనాకు భారీ షాక్.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..
మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీకి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీకి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనాకు షాక్ ఇచ్చింది. ఈమేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పలు విషయాలు వెల్లడించింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు ఇండియాలో చెందిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రత్యక్ష మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతి లేదు.
దేశంలో పెట్టుబడులకు ఎఫ్‌డీఐ రెండు రకాల అనుమతులు ఉన్నాయి. మొదటిది ఆటోమేటిక్ మార్గం కంపెనీలకు మన ఇండియా లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. రెండోది ప్రభుత్వ అనుమతితో పెట్టుబడులు పెట్టాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావంతో దేశీ కంపెనీలన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. విదేశీ సంస్థలు ఇలాంటి కంపెనీల మీద కన్నుపడింది. దేశీయ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తమ వాటాను పెంచుకోవాలని.. లేదంటే ఏకమొత్తంగా కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.
ఈ మేరకు ఎఫ్‌డీఐ రూల్స్‌ను సవరిస్తూ..దేశీయ కంపెనీల కొనుగోలును కేంద్రం నియంత్రించింది. భారత్ సరిహద్దు దేశాలకూ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి అవసరం అయ్యేంది. అయితే సవరించిన ఎఫ్‌డీఐ పాలసీతో చైనాకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
భారత్‌తో ఇన్వెస్ట్ చేసే సంస్థ ఏ దేశానికి చెందినా కూడా.. మనదేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనసరిగా తీసుకోవాల్సిందే. తాజా సవరణలతో ఎఫ్‌డీఐ డీల్ ద్వారా యాజమాన్య హక్కుల బదిలీకి కూడా కేంద్రం చెక్ పెట్టింది. కాగా .. HDFCలో ఇటీవలో చైనా బ్యాంక్ 1.01 శాతం కొనుగోలుకు ఒప్పందానికి నూతన నిబంధనలు వర్తించవని తెలుస్తోంది. 10 శాతం లేదా ఎక్కువ వాటా కొనుగోలుకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి. రక్షణ, ఫార్మా సహా 17 రంగాల్లో ఇతర దేశాల కంపెనీలు పైన పేర్కొన్న నిబంధనలు మించి పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.