Gold Loan: గోల్డ్ లోన్లకు పెరిగిన డిమాండ్.. పర్సనల్ లోన్ల కంటే తక్కువ వడ్డీ
Gold Loan: బంగారం ధరలో 70శాతం రుణంగా మంజూరు
Gold Loan: బంగారం ధర చుక్కలంటింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర దేశీయ మార్కెట్లో 61 వేల రూపాయలను మించిపోయింది. దీంతో బంగారంపై రుణాలకు డిమాండ్ పెరిగింది. మిగతా రుణాలతో పోలిస్తే బంగారాన్ని హామీగా పెట్టుకుని ఇచ్చే రుణాలను బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు త్వరగా ఇస్తాయి. పైగా వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటిపై వడ్డీ రేటు కూడా తక్కువ. ఒక నిర్ణీత పరిమితికి లోబడి అప్పటి మార్కెట్ ధరలో 70 శాతం వరకు రుణాలుగా ఇస్తారు. దీంతో చాలా మంది ఇప్పుడు బంగారం రుణాల కోసం ఎగబడుతున్నారు.