CIBIL Score: ఈ టిప్స్‌ పాటిస్తే సిబిల్‌ స్కోరుపై ఎఫెక్ట్‌ పడదు.. సులువుగా లోన్‌ వస్తుంది..!

CIBIL Score: ఈ రోజుల్లో లోన్ల విషయంలో సిబిల్‌ స్కోరు చాలా కీలకంగా మారింది. చాలామందికి దీని గురించి తెలియదు.

Update: 2023-12-07 15:00 GMT

CIBIL Score: ఈ టిప్స్‌ పాటిస్తే సిబిల్‌ స్కోరుపై ఎఫెక్ట్‌ పడదు.. సులువుగా లోన్‌ వస్తుంది..!

CIBIL Score: ఈ రోజుల్లో లోన్ల విషయంలో సిబిల్‌ స్కోరు చాలా కీలకంగా మారింది. చాలామందికి దీని గురించి తెలియదు. సిబిల్‌ స్కోరు తక్కువగా ఉంటే మీకు లోన్‌ మంజూరు కాదు. అత్యవసర సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లోన్, హోమ్ లోన్ పొందడానికి క్రెడిట్ స్కోర్‌ మెరుగ్గా ఉండాలి. ఏ బ్యాంకు అయినా సిబిల్‌ స్కోర్ చెక్‌ చేసే లోన్‌ మంజూరుచేస్తుంది. వడ్డీ రేటు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. సిబిల్‌ పెంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీకు ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అంత తొందరగా రుణం మంజూరవుతుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మంచిదని చెబుతారు. లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఏదైనా లోన్ తిరిగి చెల్లించడంలో తప్పులు చేస్తే ఆ ఎఫెక్ట్ సిబిల్‌ స్కోరుపై పడుతుంది. దీనివల్ల లోన్ మంజూరుచేసే సమయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతారు.

సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే లోన్ డిఫాల్ట్‌ కాకుండా చూసుకోవాలి. పాత రుణాలను వెంటనే చెల్లించాలి. గడువు తేదీలోపు లోన్లు, ఈఎంఐలు చెల్లించాలి. ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డు సరిపోకుంటే అధిక టాప్ లిమిట్‌తో క్రెడిట్ కార్డ్‌ని తీసుకోండి. అంతేకాని ప్రస్తుతం ఉన్న కార్డులో మొత్తాన్ని వాడవద్దు. మంచి సిబిల్ స్కోర్ మెయింటెన్ కావాలంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతానికి మించి ఉండకూడదు. మీ పాత క్రెడిట్ కార్డులను వెంటనే క్లోజ్ చేయవద్దు. ఇది సిబిల్ స్కోర్ పై నెగిటివ్‌ప్రభావం చూపుతుంది. అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిని తగ్గిస్తుంది. తద్వారా క్రెడిట్ వినియోగ నిష్పత్తిపెరిగిపోతుంది. అందుకే పాత క్రెడిట్ కార్డులను అలాగే కొనసాగించాలి.

Tags:    

Similar News