Reliance SBI Card: రిలయన్స్ SBI కార్డ్‌తో సూపర్‌ బెనిఫిట్స్‌.. ప్రతి నెల ఉచిత సినిమా టిక్కెట్లు ఇంకా మరెన్నో..!

Reliance SBI Card: SBI, రిలయన్స్ రిటైల్ సంయుక్తంగా కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాయి.

Update: 2023-11-06 15:30 GMT

Reliance SBI Card: రిలయన్స్ SBI కార్డ్‌తో సూపర్‌ బెనిఫిట్స్‌.. ప్రతి నెల ఉచిత సినిమా టిక్కెట్లు ఇంకా మరెన్నో..!

Reliance SBI Card: SBI, రిలయన్స్ రిటైల్ సంయుక్తంగా కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాయి. ఈ కార్డు పేరు 'రిలయన్స్ SBI కార్డ్'. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. రిలయన్స్ SBI కార్డ్, ఇంకా రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్. రిలయన్స్ రిటైల్ ఎకోసిస్టమ్‌లోని స్టోర్‌లలో రెండు కార్డ్‌లతో చెల్లింపులు చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. రెండు కార్డులపై వేర్వేరు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రిలయన్స్ SBI కార్డ్ ఛార్జీలు

రిలయన్స్ రిటైల్, SBI కార్డ్ కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందించే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద రిలయన్స్ రిటైల్ కస్టమర్లు, SBI కార్డ్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను పొందవచ్చు. వారికి ప్రత్యేకమైన ప్రయాణ, వినోద ప్రయోజనాలకు యాక్సెస్‌ లభిస్తుంది. రిలయన్స్ SBI కార్డ్ జాయినింగ్ ఫీజు రూ.499. ఇందులో పన్ను ఉండదు. వార్షిక రుసుం రూ.499 + పన్నులు. మీరు రూ.1 లక్ష ఖర్చు చేస్తే వార్షిక రుసుము మినహాయిస్తారు. వెల్‌కమ్ ఆఫర్ కింద రూ. 500 రిలయన్స్ రిటైల్ వోచర్‌ను పొందుతారు. రిలయన్స్ బ్రాండ్ కోసం 3200 రూపాయల తగ్గింపు వోచర్ అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ ఛార్జీలు

రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ జాయినింగ్ ఫీజు రూ.2999 + పన్నులు. వార్షికంగా రూ.3 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుంది. వెల్‌కమ్ ఆఫర్ కింద రూ.3000 రిలయన్స్ రిటైల్ వోచర్‌ను పొందుతారు. వివిధ రిలయన్స్ బ్రాండ్‌లకు రూ.11,999 విలువైన తగ్గింపు వోచర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్డ్‌లో 8 దేశీయ, 4 అంతర్జాతీయ విమానాశ్రయాల లాంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి నెలా రూ. 250 విలువైన సినిమా టికెట్లను ఉచితంగా పొందుతారు.

Tags:    

Similar News