Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి ఎలా పెట్టాలి..! వడ్డీ ఎంత ఉంటుంది..

Update: 2021-11-20 12:48 GMT

Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి ఎలా పెట్టాలి..! వడ్డీ ఎంత ఉంటుంది..

Government Bonds: ప్రస్తుత రోజుల్లో సాధారణ ప్రజలు పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలున్నాయి. అయితే కొన్ని సమయాల్లో ప్రజలు సురక్షితమైన పెట్టుబడిని ఎంచుకోవడం చాలా కష్టంగా మారుతోంది. సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో దేశంలోని సామాన్యులు సులభంగా పెట్టుబడులు పెట్టగలరు. ఈ పథకం కింద దేశంలోని అతి చిన్న పెట్టుబడిదారుడు కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ

సాధారణంగా ప్రజలు తమ డబ్బుని సురక్షితంగా ఉంచుకోవడానికి ఎక్కువగా బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడుతారు. అయితే ప్రభుత్వం బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలను ప్రవేశపెట్టింది. వీటి కింద పెట్టుబడిదారులు సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును పొందుతారు. పెట్టుబడి భద్రత గురించి మాట్లాడితే.. మీ డబ్బు ప్రభుత్వం వద్ద క్షేమంగా ఉంటుంది.

పెట్టుబడి పెట్టడానికి 4 ఎంపికలు

ఈ పథకం కింద సామాన్యులు పెట్టుబడి పెట్టడానికి 4 అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ట్రెజరీ బిల్లులు. ఇవి కేంద్ర ప్రభుత్వ బాండ్‌లు. 91 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు జారీ చేస్తారు. రెండోది డేటెడ్ గవర్నమెంట్ బాండ్‌లు ఇవి ఒకటి కంటే ఎక్కువ కాలానికి జారీ చేసే కేంద్ర ప్రభుత్వ బాండ్‌లు. మూడోది రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు. నాలుగోది సావరిన్ గోల్డ్ బాండ్లు. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి మీరు రిజర్వ్ బ్యాంక్ పోర్టల్‌ని సందర్శించి RDG ఖాతాను తెరిచి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు లాభం చూసి వాటిని ఈ పోర్టల్‌లో అమ్మవచ్చు.

ప్రభుత్వ బాండ్లు అంటే ఏమిటి

ఏదైనా ప్రభుత్వం లేదా కంపెనీ డబ్బును సేకరించేందుకు బాండ్లను జారీ చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్థిర వడ్డీని ఇస్తుంది. మీ డబ్బు భద్రతకు పూర్తి హామీని ఇస్తుంది. సాధారణ ప్రజల కోసం ప్రారంభించిన పథకాలకు పెట్టుబడిదారుల నుంచి పొందిన డబ్బును ఖర్చు చేస్తుంది.

Tags:    

Similar News