PF Balance: మీ పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ నెంబర్‌కు ఒక్క మిస్ కాల్‌ ఇవ్వండి..

PF Balance Missed Call: ప్రొవిడెంట్‌ ఫండ్ (PF) ఉద్యోగుల పదవీ విరమణ ఆర్థిక భద్రత కోసం ప్రతి కంపెనీ జీతంలోని కొంత డబ్బును జమా చేస్తుంది. అయితే, ఏవైనా అవసరాలు ఉంటే మధ్యలో కొంత మొత్తం విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. అయితే పీఎఫ్‌ బ్యాలన్స్‌ సింపుల్‌ మిస్‌ కాల్‌ వాడి కూడా తెలుసుకోవచ్చు.

Update: 2025-03-21 02:30 GMT
PF Balance

PF Balance: మీ పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ నెంబర్‌కు ఒక్క మిస్ కాల్‌ ఇవ్వండి..

  • whatsapp icon

PF Balance Missed Call: పీఎఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడానికి యూజర్‌ నేమ్‌, పాస్వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఏం అవసరం లేకుండా ఈజీగా పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. దీనికి మీరు కేవలం ఒక్క నెంబర్‌కు మిస్ట్‌ కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నేరుగా మీ మొబైల్‌ ఫోన్‌కు ప్రస్తుతం మీ పీఎఫ్‌ బ్యాలన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అయితే, మీ యూఏఎన్‌కు లింక్‌ అయి ఉన్న రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ కచ్చితంగా మీ వద్ద ఉండాలి. 9966044425 నంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్‌ ద్వారా ఒక్క మిస్ట్‌ కాల్‌ ఇస్తే చాలు బ్యాలన్స్‌ మీ మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్‌పై వెంటనే మెసేజ్‌ రూపంలో కనిపిస్తుంది.

అంతేకాదు ఒకవేళ మీరు కాల్‌ కాకుండా మెసేజ్‌ కూడా చేసి పీఎఫ్‌ బ్యాలన్స్‌ తెలుసుకోవచ్చు. దీనికి మీరు 7738299899 నంబర్‌కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే 'EPFOHO ENG అని మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. ఇక్కడ 'ENG' అంటే ఇంగ్లిష్‌ అని అర్థం. మీ స్థానిక భాష మొదటి మూడు లెట్టర్స్‌ టైప్‌ చేసినా పీఎఫ్‌ బ్యాలన్స్‌ తెలుసుకోవచ్చు.

ఇది కాకుండా సాధారణంగా అయితే, ఈపీఎఫ్‌ఎ అధికారిక పోర్టల్‌కు వెళ్లి కూడా పీఎఫ్ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎంప్లాయీస్‌ సెక్షన్‌లో మెంబర్‌ పాస్‌బుక్‌లో యూఏఎన్‌ నంబర్‌, పాస్వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పీఎఫ్‌ బ్యాలన్స్‌ తెలిసిపోతుంది.

ఉమాంగ్‌ యాప్‌..

ఈ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ముందుగా మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి ఉమాంగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో కేవలం పీఎఫ్‌ మాత్రమే కాదు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో క్లెయిమ్‌ సబ్మిట్‌ చేసి మీ పాస్‌బుక్‌ను తెలుసుకోవచ్చు. అయితే, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్‌ చేయాల్సి వస్తుంది.

Tags:    

Similar News