Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంతో తెలిస్తే ఆనందంతో ఊగిపోతారు

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. ఏకంగా 90వేల రూపాయల ధర నుంచి దిగువకు చేరుకుంది. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి మరింత ముందుకు వెళ్తాయని అంతా భావించారు. కానీ నెమ్మదిగా దిగివస్తోంది. పసిడి ప్రియులకు ఈ వార్త కాస్త ఊరట కలిగించవచ్చు.
కాగా నేడు మార్చి 23వ తేదీ ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గినట్లుగా మనం గమనించవచ్చు. శనివారంతో పోల్చితే ఆదివారం తగ్గింది. బంగారం ధర రూ. 90,000 దిగువకు చేరుకుంది. నేటి ధరలు ఇలా ఉన్నాయి. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89, 780 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,300 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 1,01,000పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా దిగివస్తున్నాయి.
నిజానికి బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ రూ. 92,000 వద్ద బంగారం ధర ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం బంగారం ధర గత మూడు సెషన్లుగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు మెరుగుడపటమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చేరుకోవడంతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో రష్యా అధ్యక్షుడు యుద్ధం నిలిపివేసేందుకు సుముఖత తెలిపారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుతం రికవరీ బాటలో ఉన్నాయి. ఫలితంగా బంగారం ధర తగ్గేందుకు ఒక కారణం లభించినట్లు అయ్యింది.