Flight Ticket Offers: బంపర్ ఆఫర్ రూ. 11 కే విమానం టికెట్..హైదరాబాద్ నుంచే జర్నీ

Flight Ticket Offers: విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి అదిరిపోయే న్యూస్. బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే విమాన టికెట్లను పొందవచ్చు. ఎలా అనుకుంటున్నారా. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వియయాత్నంకు టూర్ ప్లాన్ చేసుకుంటున్న హైదరాబాదీలకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు.
వియాత్నంకు ప్రముఖ విమానయాన సంస్థ వియట్ జెట్ హైదరాబాద్ నుంచి హోచిమిన్ నగరానికి ప్రత్యక్ష విమానాన్ని ప్రారంభించనుంది. మార్చి 18 నుంచి ఈ సర్వీసులను ప్రారంభం కానున్నాయి. కొన్ని కండిషన్స్ తో కూడిన ఎకానమీ క్లాస్ వన్ వే టికెట్ ధర రూ 11 నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి ట్యాన్స్ అదనంగా ఉంటాయి. విమానాలు వారానికి రెండుసార్లు మంగళవారం, శనివారం ఉంటాయి. సాధారణంగా రూ. 11 నుంచి విమా ఛార్జీకి అదనంగా ప్రయాణికుడు సౌకర్య రుసుము, ఏవియేషన్ సెక్యూరిటీ రుసుము, ప్యాసింజర్ సర్వీస్ ఫీజు, యూజర్ డెవలప్ మెంట్ ఫీజు, జీఎస్టీ మొదలైనవి చెల్లించాలి.
ఈ ఛార్జీలు అన్నీ కూడా ప్రయాణికులు ప్రయాణించే ఎయిర్ పోర్టు నుంచి తుది టికెట్ ధరకు జోడిస్తారు. ప్రస్తుత సందర్భంలో ప్రయాణికుడు తిరుగు ప్రయాణ ఛార్జీని సాధారణ ధరకు కొనుగోలు చేయాలి. అందువల్ల ప్యాసింజర్లు ఈ విషయాన్ని ముందే గ్రహించాలి. వియట్ జెట్ ఎయిర్ లైన్ మార్చి 24 వరకు హైదరాబాద్ నుంచి హోచిమిన్ బెంగళూరు హోచిమిన్ మార్గాల కోసం రెండు ప్రత్యేక ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. మొదటి ఆఫర్ కింద రూ. 11 ప్రారంభ ధరతో టికెట్ తీసుకోవచ్చు. దీనికి ట్యాక్స్ లు ఇతర ఫీజులు అదనంగా ఉంటాయి. ఆఫర్ లో భాగంగా టికెట్లు బుక్ చేసుకుంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 15 మధ్య జర్నీ చేయవచ్చు. ప్రభుత్వ సెలవులు, ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో ఆఫర్ వర్తించదు.
రెండవ ఆఫర్ విషయానికి వస్తే ఇది భారత్ వియాత్నం మార్గాల్లో ప్రయాణికులు 20శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. విమాన టికెట్లను బుక్ చేసుకునేందుకు కస్టమర్ హోలీ ఇండియా ప్రోమో కోడ్ ను ఉపయోగించాలి. టిక్కెట్లు, ఇతర వివరాలు అధికారిక వెబ్ సైట్లో, వియట్ జెట్ ఎయిర్ మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.