Gold Rate Today: మహిళలకు షాక్..మరోసారి పెరిగిన బంగారం ధరలు

Update: 2025-03-21 03:40 GMT
Gold Rate Today: మహిళలకు షాక్..మరోసారి పెరిగిన బంగారం ధరలు
  • whatsapp icon

 Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటన్న నిర్ణయాల వల్ల బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది.

ప్రపంచ ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకు బంగారం నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా హైరదాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గత ఏడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి పగ్గాలు చేపట్టిన తర్వాత బంగారం ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా బంగారం ను సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచేశారు. దీంతో ఇన్వెస్టర్లంతా ఒక్కసారిగా బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది.

ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగింది 10 గ్రాముల ధర రూ. 83,110గా ఉంది. 24క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాములకు ధర రూ. 90., 670గా నమోదు అయ్యింది.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు:

కోల్‌కతా- రూ.83,110, రూ.90,670

చెన్నై- రూ.83,110, రూ.90,670

బెంగళూరు- రూ.83,110, రూ.90,670

పుణె- రూ.రూ.83,110, రూ.90,720

Tags:    

Similar News