Property Right: తాత ఆస్తిపై మనవడికి, మనవరాలికి ఎంత హక్కు ఉంటుందో తెలుసా..?
Property Right: ఆస్తి వివాదాలు అంత త్వరగా పరిష్కారం కాలేదు. చాలా సంవత్సరాలు వాయిదా పడుతూ ఉంటాయి.
Property Right: ఆస్తి వివాదాలు అంత త్వరగా పరిష్కారం కాలేదు. చాలా సంవత్సరాలు వాయిదా పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన చాలా కేసులు కోర్టులలో ఏళ్ల తరబడి మూలుగుతూ ఉన్నాయి. వీటికి అంత తొందరగా సరైన పరిష్కారం లభించదు. అయితే తాత ఆస్తిపై మనవడికి, మనవరాలికి ఎంత హక్కు ఉంటుంది.. తండ్రి ఆస్తిలో కుమారుడు, కూతురికి హక్కులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.
ఒకరి తండ్రి, తాత, ముత్తాత నుంచి సంక్రమించిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి అంటారు. సరళంగా చెప్పాలంటే గత నాలుగు తరాల వరకు పురుషులు ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే దానిని పూర్వీకుల ఆస్తి అంటారు. పూర్వీకుల ఆస్తిపై ఏ వ్యక్తికైనా హక్కు పుట్టుకతోనే వస్తుంది. అయితే ప్రాపర్టీలను రెండు భాగాలుగా విభజించారని మీకు తెలుసా. ఇందులో మొదటిది పూర్వీకుల ఆస్తి, రెండోది స్వయంగా సంపాదించిన ఆస్తి.
తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ సందర్భంలో చట్టబద్ధమైన వారసులకు తండ్రి ఆస్తిలో సమాన హక్కులు లభిస్తాయి. ఇందులో అతని భార్య, కొడుకు, కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయి. మరెవరికీ ఉండదు. పూర్వీకుల ఆస్తిలో వాస్తవానికి పుట్టిన తర్వాత మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ తాత ఆస్తి అతని సొంత సంపాదన అయితే అది పూర్వీకులది కాదు. కాబట్టి మనవడికి ఆ ఆస్తిలో పుట్టుకతో హక్కు ఉండదు. అలాగే ఆ ఆస్తిలో హక్కు కూడా డిమాండ్ చేయరాదు. కానీ తాతగారు కోరుకుంటే ఈ ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. నిజానికి పూర్వీకుల ఆస్తిలో మనవడికి, మనవరాలికి సమాన వాటా ఉంటుంది. అయితే తాతయ్య మనవడికి వాటా ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కేసులో మనవాడు కేసు పెట్టవచ్చు. తండ్రి బతికి ఉంటే మాత్రం వాటా ఎవరికీ రాదని గుర్తుంచుకోండి.