హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్ ఏప్రిల్ నుంచి ఎలా మారాయి? ఈ మార్పుల ప్రభావం పాలసీపై ఎలా ఉంటుంది?

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్ మారుస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్ మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-21 04:37 GMT

హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్ ఏప్రిల్ నుంచి ఎలా మారాయి? ఈ మార్పుల ప్రభావం పాలసీపై ఎలా ఉంటుంది?

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్ మారుస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్ మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 23న మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. మారిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చాయి.

నో ఏజ్ లిమిట్

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి వయోపరిమితి లేదని ఐఆర్ డీ ఏ స్పష్టం చేసింది. అన్ని రకాల వయస్సుల వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొనేందుకు అర్హులని ప్రకటించింది. గతంలో కొన్ని వయస్సుల వారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వకపోయేవారు.

వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు

డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి చికిత్స కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారు కనీసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది.మారిన నిబంధనల మేరకు పాలసీ తీసుకున్న మూడేళ్ల నుండి ఈ తరహా రోగాలకు కూడ చికిత్స తీసుకోవచ్చు.

జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జరీకి

గతంలో జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జరీకి పాలసీ తీసుకున్నవారు నాలుగేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఇక నుండి మూడేళ్లకు ఈ శస్త్రచికిత్స చేసుకొనేందుకు వెసులుబాటు దక్కింది.

గుండెజబ్బులున్నా హెల్త్ పాలసీ

క్యాన్సర్, గుండె జబ్జులు, ఎయిడ్స్ తో బాధపడేవారికి గతంలో హెల్త్ పాలసీ ఇచ్చేవారు కాదు. ఇక నుండి ఈ తరహా జబ్బులున్నవారికి కూడ హెల్త్ పాలసీ ఇచ్చేందుకు ఐఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.

ఆయుష్ ట్రీట్ మెంట్ లో పూర్తిగా క్లైయిమ్

ఆయుష్ ట్రీమ్ లో కూడ పాలసీ దారులు పూర్తిగా క్లైయిల్ చేసుకొనే వెసులుబాటు దక్కింది. గతంలో ఆయుర్వేద, యోగ, నేచురోపతి, సిద్ద, యునాని,హోమియోపతి విభాగాల్లో కొంత శాతం మేరకే పాలసీదారులు క్లైయిమ్ చేసుకొనే అవకాశం ఉండేది.

సీనియర్ సిటిజన్ల కోసం

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న సీనియర్ సిటిజన్ల సహాయం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. క్లైయిమ్ లు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.

మారటోరియం పీరియడ్ ఐదేళ్లకు తగ్గింపు

హెల్త్ ఇన్సూరెన్స్ మారటోరియం పీరియడ్ ను ఎనిమిదేళ్ల నుండి ఐదేళ్లకు కుదించారు.

ప్రత్యేక పాలసీలు

పిల్లలు, సీనియర్ సిటిజన్లు, గర్బిణీలు, విద్యార్థులకు ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ లను రూపొందించాలని ఐఆర్డీఏ సూచించింది.

Tags:    

Similar News