hmtv Business Excellence Awards 2022: వ్యాపార రంగంలో విశేషంగా రాణించిన దిగ్గజాలకు hmtv సత్కారం

*ప్రతిష్టాత్మక hmtv బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించనున్న hmtv

Update: 2022-10-29 17:00 GMT

వ్యాపార రంగంలో విశేషంగా రాణించిన దిగ్గజాలకు hmtv సత్కారం

hmtv Business Excellence Awards 2022: హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2022 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 2009లో మీడియా రంగంలో ప్రస్థానం ప్రారంభించిన హెచ్ఎంటీవీ.. 2017 నుంచి వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినవారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం వివిధ విభాగాలను గుర్తించి ఆయా విభాగాల కింద వ్యాపారవేత్తలను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో ఈసారి 18 మంది ప్రముఖులను గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులు అందించింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‎లో బెస్ట్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్స్ గా బామర్ లారీకి చెందిన ఛైర్మన్ అండ్ ఎండీ అధికరత్న శేఖర్ ను అవార్డు వరించింది. ఇదే సెక్టార్లో బెస్ట్ బల్క్ డ్రగ్ మ్యానుఫాక్చరర్ గా మెట్రోకెమ్ API ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు అవార్డు అందుకున్నారు. బెస్ట్ పవర్ ప్లాంట్ కింద NTPC లిమిటెడ్ రామగుండం హెడ్ ఆఫ్ O&M అతుల్ కమలాకర్ దేశాయ్ కి అవార్డు అందజేశారు.

ఇక రిటైల్ సెక్టార్లో బెస్ట్ చైన్‌ ఆఫ్ సూపర్ మార్కెట్స్ విభాగంలో విజేత సూపర్ మార్కెట్ ఎండీ మురకొండ జగన్మోహన్‎రావుకు అవార్డు అందజేశారు. ఇదే సెక్టార్లో బెస్ట్ టెక్స్‎టైల్ షోరూమ్స్ విభాగంలో తెలంగాణ నుంచి CMR ఫ్యామిలీ మాల్ ఎండీ అల్లక సత్యనారాయణ అవార్డు అందుకున్నారు. బెస్ట్ జువెల్లర్స్ గా మానేపల్లి జువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణ సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బెస్ట్ రియల్ఎస్టేట్ ఫర్మ్ విభాగంలో శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ ఎండీ కాసర్ల మహేందర్‎రెడ్డి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ఇక బెస్ట్ శానిటరీవేర్ అండ్ ఫిక్స్‌చర్స్ విభాగంలో సూర్య ఇంటర్నేషనల్ ఎండీ పెండ్యాల హరినాథ్ బాబును అవార్డు వరించింది. బెస్ట్ మొబైల్ స్టోర్స్ విభాగంలో సెల్‎బే ఎండీ సోమానాగరాజుకు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు.

ఇక సర్వీస్ సెక్టార్లో బెస్ట్ సోషల్ సర్వీస్ విభాగంలో మనోజ్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ కామూరి రమణారెడ్డిని అవార్డు వరించింది. బెస్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ విభాగంలో ఎక్సెల్లా గ్లోబల్ ఎడ్‎టెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అరవింద్ అరసవిల్లిని అవార్డు వరించింది. బెస్ట్ స్కూల్ విభాగంలో SDR వరల్డ్ స్కూల్ చైర్మన్ శనివారపు కొండారెడ్డికి ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. బెస్ట్ చైన్ ఆఫ్ హోటల్స్ విభాగంలో హోటల్ SVM గ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వరప్రసాద్ కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. బెస్ట్ ఇన్వెస్ట్‎మెంట్ సొల్యూషన్స్‌ కింద సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన కె.ద్వారకా రమేశ్ కు అవార్డు అందజేశారు.

ఇక స్పెషల్ అవార్డ్‌ సెక్షన్లో విమెన్ ఎంట్రిప్రెన్యూర్‌ ఆఫ్ ద ఇయర్ గా శ్రావణి హాస్పిటల్స్ సీఈవో శ్రావణి చెట్టుపల్లిని అవార్డు వరించింది. లెగసీ బిజినెస్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ గా పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నరేశ్ కు అవార్డు అందజేశారు. యంగ్ ఎంట్రిప్రెన్యూర్‌ ఆఫ్ ద ఇయర్ గా సుచిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రూపాలి కిరోన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ఇదే విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ గా KIMS హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని భాస్కర్‎రావు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు.

ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మంత్రి గుడివాడ అమర్‎నాథ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, అతిథులు హాజరయ్యారు. 

Tags:    

Similar News