Cashless Treatment: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా.. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ వర్తిస్తుందా..!
Cashless Treatment: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డబ్బులు లేకున్నా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే ధీమాలో చాలామంది ఉంటారు.
Cashless Treatment: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డబ్బులు లేకున్నా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే ధీమాలో చాలామంది ఉంటారు. కానీ అన్ని సమయాలలో ఇది వర్తించదని చాలా మందికి తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ కంపెనీ నిబంధనలు, షరతుల గురించి కచ్చితంగా తెలుసుకొని తర్వాత పాలసీ కొనుగోలు చేయాలి. లేదంటే అత్యవసర సమయంలో వీటిని కారణంగా చూపించి కంపెనీలు డబ్బులు చెల్లించవు. ఫలితంగా తిరిగి మనం జేబులో నుంచి బిల్లు చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రోజు అలాంటి కొన్ని నిబంధనల గురించి తెలుసుకుందాం.
కొన్ని రకాల హెల్త్ పాలసీలు కవరేజీ పరిమితులను కలిగి ఉంటాయి. కొన్ని వ్యాధులకు చికిత్స అందించరు. వాటి గురించి తెలుసుకొని పాలసీ కొనుగోలు చేయాలి. అలాగే మరికొన్ని వ్యాధులకు కొన్ని హాస్పిటల్స్‌లోనే చికిత్స ఉంటుంది. అన్ని హాస్పిటల్స్‌లో ఈ సేవలు అందించరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని హెల్త్ పాలసీలు కో పేమెంట్ ఆప్షన్‌తో వస్తాయి. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీ సగం చెల్లిస్తే మీరు సగం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని కంపెనీలు కస్టమర్ల దగ్గర దాచిపెడుతాయి. దీని గురించి అడిగి మరీ పాలసీ తీసుకోవడం ఉత్తమం.
మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్‌లో లేని హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికయ్యే ఖర్చు మొత్తం మీరే చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కంపెనీ సగం చెల్లించి మిమ్మల్ని సగం చెల్లించాలని చెబుతోంది. కొన్ని సందర్భాలో పూర్తి మొత్తం మీరే చెల్లించి అన్ని బిల్లులతో రీయింబర్స్ కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కేవలం ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్స్‌లో మాత్రమే వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మీరు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌కి వెళితే ముందుగా చెల్లించి తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.