PF Money: పీఎఫ్‌ డబ్బుల కోసం అప్లై చేశారా.. అకౌంట్‌లో పడడం లేదా.. ఈ వివరాలు తెలుసుకోండి..!

PF Money: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో అకౌంట్‌ ఉంటుంది. దీనినే ఉద్యోగుల భవిష్య నిధి అని పిలుస్తారు. ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రతని కల్పిస్తుంది.

Update: 2024-05-14 12:30 GMT

PF Money: పీఎఫ్‌ డబ్బుల కోసం అప్లై చేశారా.. అకౌంట్‌లో పడడం లేదా.. ఈ వివరాలు తెలుసుకోండి..!

PF Money: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో అకౌంట్‌ ఉంటుంది. దీనినే ఉద్యోగుల భవిష్య నిధి అని పిలుస్తారు. ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రతని కల్పిస్తుంది. నెల నెలా పెన్షన్‌ మంజూరు చేస్తుంది. అయితే ఇందుకోసం ఉద్యోగం చేసే కాలంలో కొంత అమౌంట్‌ ఇందులో పొదుపు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగులకు అత్యవసర అవసరం వచ్చినప్పుడు ఈ అమౌంట్‌ విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అయితే ఎన్ని రోజులకు డబ్బులు అకౌంట్‌లో పడుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి తన బేసిక్‌ వేతనంలో 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అంతే మొత్తంలో యజమాని ఉద్యోగి ఖాతాకు పీఎఫ్ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. యజమానికి సంబంధించిన 12 శాతం వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 3.67 శాతం భవిష్య నిధికి వెళ్తుంది. మరోవైపు ఉద్యోగి మొత్తం సహకారం 12 శాతం భవిష్య నిధికి వెళుతుంది. ఉద్యోగం మానేశాక ఉద్యోగి కొత్త కంపెనీలో చేరకుండా అరవై రోజులు పూర్తయితే వంద శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ సందర్భంలో ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన తుది సెటిల్‌మెంట్ కోసం ఈపీఎఫ్ఓ ఫారమ్-19 నింపి సమర్పించాలి. అదేవిధంగా ఈపీఎఫ్‌కు నెల నెలా తన వాటా అందిస్తున్న ఉద్యోగి అయితే కొన్ని షరతులతో 75 శాతం వరకు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఒక ఈపీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. గడువులోపు దరఖాస్తుదారుకు డబ్బు అందకపోతే సబ్‌స్క్రైబర్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవసరమైతే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News