GST Council Meet: ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
GST Council Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
GST Council Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు సమావేశం ఎజెండాగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రాలకు పరిహారాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చమురును జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5శాతం, కొవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లపై 12శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్యాక్సుల నుంచి మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహాయింపులు ఇస్తే రేట్లు పెంచే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి సమావేశంలో కేవలం పన్ను రేటు తగ్గించే నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.