Govt Not Extend: ప్రభుత్వం ఈ స్కీమ్‌ల గడువు పొడగించలేదు.. ఇప్పుడు జరిమానా చెల్లించాల్సిందే..!
Govt Not Extend: ప్రభుత్వం సెప్టెంబర్ 30 లోపు కొన్ని పనులను పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ చాలామంది వీటిని మరికొన్ని రోజులు పొడగిస్తారని ఈ పనులను కంప్లీట్ చేయలేదు.
Govt Not Extend: ప్రభుత్వం సెప్టెంబర్ 30 లోపు కొన్ని పనులను పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ చాలామంది వీటిని మరికొన్ని రోజులు పొడగిస్తారని ఈ పనులను కంప్లీట్ చేయలేదు. అయితే ఇందులో కొన్నిస్కీమ్‌ల గడువు పొడిగించారు కానీ మరికొన్ని స్కీమ్‌ల గడువు పొడగించలేదు. పొడిగించిన వాటిలో డీ-మ్యాట్ నామినేషన్, మ్యూచువల్ ఫండ్ నామినేషన్, ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ, రూ. 2000 నోటు మార్పిడి ఉన్నాయి. కానీ పొడగింపు చేయని కొన్ని పనుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
SBI Wecare
సీనియర్ సిటిజన్లకు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం FDపై 7.50% వడ్డీని చెల్లించడానికి 2022లో ఎస్బీఐ 'SBI V-కేర్' స్పెషల్ ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్, 2023. ఈ స్కీమ్‌ని పొడిగించలేదు. ఎలాంటి మార్పులు చేయలేదు.
సేవింగ్ స్కీమ్‌తో ఆధార్ లింక్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్‌లను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. దీన్ని చేయకపోతే ఖాతా స్తంభిస్తుంది. ఈ పథకాలతో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023 మాత్రమే. దీనిని కూడా పొడిగించలేదు.
LIC ధన్ వృద్ధి
ఎల్‌ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పర్సనల్, సేవింగ్, సింగిల్ ప్రీమియం ప్లాన్. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రత, పొదుపు రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ ప్లాన్ చివరి తేదీ కూడా 30 సెప్టెంబర్ 2023. దీనిని కూడా పొడిగించలేదు.
TCS కొత్త రూల్
ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.7 లక్షల వరకు విలువైన విదేశీ టూర్ ప్యాకేజీలపై 5 శాతం TCS విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబరు 30 వరకు ప్రయాణాలపై ఎలాంటి పన్ను చెల్లించలేదు. అక్టోబర్ 1 నుంచి టీసీఎస్ నిబంధనలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అంటే ఇప్పుడు రూ.7 లక్షలకు పైగా విదేశీ ప్రయాణం ఖరీదుగా మారింది.
ఆదాయపు పన్ను
చట్టం 1961లోని సెక్షన్ 44AB ప్రకారం ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికను సమర్పించే సమయ పరిమితిని పొడిగించలేదు. ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు ఆడిట్ నివేదికను సెప్టెంబర్ 30 లోపు సమర్పించకపోతే ఇప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.