Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు త్వరలో తీపి కబురు.. లోక్‌సభ ఎన్నికలలోపు వాళ్ల కోరికలు నెరవేరే అవకాశం..!

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యేలోపు వారి డిమాండ్స్‌ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో వారి జీతాలు 17 శాతం పెరగవచ్చు.

Update: 2024-03-12 04:30 GMT

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు త్వరలో తీపి కబురు.. లోక్‌సభ ఎన్నికలలోపు వాళ్ల కోరికలు నెరవేరే అవకాశం..!

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యేలోపు వారి డిమాండ్స్‌ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో వారి జీతాలు 17 శాతం పెరగవచ్చు. నవంబర్ 2022 నుంచి పెరిగిన జీతాలు పొందే అవకాశం ఉంది. కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 పని దినాలు అనే పద్దతిని అమలు చేసే యోచనలో ఉన్నారు. అంటే వారానికి రెండు రోజులు సెలవు రోజులు వస్తాయి. ఇక నుంచి శనివారం కూడా బ్యాంకులకు సెలవు అన్నట్లే.

ఈ నిర్ణయాలతో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వారంలో పెరిగిన జీతం, ఒక రోజు అదనపు సెలవు ప్రయోజనం పొందుతారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్‌ ఉద్యోగుల సంస్థల మధ్య 17 శాతం వార్షిక వేతన పెంపుపై ఒప్పందం కుదిరింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏటా దాదాపు రూ.8,285 కోట్ల అదనపు భారం పడనుంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రతి శనివారం సెలవు దినంగా ఆమోదించడానికి అంగీకరించింది.

ప్రస్తుతం దేశంలో ప్రతి నెల రెండో, నాలుగో శనివారం సెలవులు ఉంటాయి. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత బ్యాంకుల్లో 5 రోజుల పని దినాలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ప్రతిపాదనలను అమలు చేస్తే బ్యాంకుల్లో పని గంటలు పెరుగుతాయా లేదా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త వేతన ఒప్పందం ప్రకారం మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ప్రతి నెలా ఒక రోజు 'సిక్ లీవ్' తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవులను కూడబెట్టుకునే హక్కును పొందుతారు.

Tags:    

Similar News