Indian Railway: రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. ఇప్పుడు ఈ పనిపై ఎలాంటి ఛార్జీ విధించరు..!
Indian Railway: రైల్వే ప్రయాణికులకి ఇది శుభవార్తనే చెప్పాలి.
Indian Railway: రైల్వే ప్రయాణికులకి ఇది శుభవార్తనే చెప్పాలి. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి రైల్వే ఇప్పుడు మరో సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి భారతదేశంలో చాలా మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు కాబట్టి రైలును భారతదేశం లైఫ్ లైన్ అని పిలుస్తారు. రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికులని దృష్టిలో ఉంచుకొని వారికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు టిక్కెట్ల విషయంలో కూడా మరో మార్పు చేసింది.
ఇప్పుడు ప్రయాణికుల టిక్కెట్ల విషయంలో రైల్వేశాఖ సరికొత్త నిబంధనను రూపొందించింది. మీరు నిమిషాల వ్యవధిలో టిక్కెట్లను సులభంగా రద్దు చేసుకోవచ్చు. రైల్వే యాప్ లేదా రైల్వే వెబ్‌సైట్‌ను సందర్శించి మీ టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ-మెయిల్ ద్వారా రైలు టిక్కెట్లను రద్దు చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశాన్ని కల్పిస్తోంది. రైల్వే తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రైల్వే ప్రయాణీకుడు తన టిక్కెట్‌ను రైల్వేకు ఈ మెయిల్ చేయడం ద్వారా రద్దు చేసుకోవచ్చని ట్వీట్ చేసింది.
వాస్తవానికి ఒక ప్రయాణికుడు తత్కాల్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకున్నట్లు ట్విట్టర్‌లో రైల్వేకు ఫిర్యాదు చేశాడు. కానీ రైలు రద్దు కారణంగా అతను మరొక ప్రయాణ ఎంపికను ఎంచుకోవలసి వచ్చిందని తెలిపాడు. అయితే టికెట్ రద్దు చేసినా డబ్బులు వాపసు రావడం లేదని పేర్కొన్నాడు. దీనిపై రైల్వే స్పందించి ఈ విషయాన్ని వెల్లడించింది.'ప్రయాణికులు స్వయంగా టిక్కెట్‌ను రద్దు చేయలేకపోతే టికెట్ రద్దు కోసం తన రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడి నుంచి రైల్వేకు etickets@ వద్ద ఈ -మెయిల్ చేయవచ్చని సూచించింది. irctc.co.in ద్వారా టికెట్ రద్దు చేసుకోవచ్చని తెలిపింది.