మందుబాబులకి గుడ్‌న్యూస్.. ఇక టెన్షన్ వద్దు రిలాక్స్‌గా ఉండండి..!

Good News: మందుబాబులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మందుకోసం క్యూలైన్‌లో నిలుచునే ఇబ్బంది ఉండదు.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడతామనే భయం ఉండదు.

Update: 2022-06-05 10:30 GMT

మందుబాబులకి గుడ్‌న్యూస్.. ఇక టెన్షన్ వద్దు రిలాక్స్‌గా ఉండండి..!

Good News: మందుబాబులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మందుకోసం క్యూలైన్‌లో నిలుచునే ఇబ్బంది ఉండదు.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడతామనే భయం ఉండదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో మద్యం మీ రూమ్‌ ముందుంటుంది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ మద్యం సరఫరా చేస్తోంది. కానీ హైదరాబాద్ లో కాదు.. కోల్ కతా లో. హైదరాబాద్‌కే చెందిన ఇన్నోవెంట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టార్టప్ కంపెనీ 'బూజీ' బ్రాండ్‌ పేరుతో ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది.

వైన్స్ షాప్ ముందు లైన్ లో నిల్చునే మద్యం ప్రియుల ఇబ్బందులు గమనించి, వైన్ డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో లిక్కరును డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. ఈ సేవలు కోల్ కతాలో ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకొని ఈ సర్వీసును ప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై పన్నును తగ్గిస్తున్నాయి. దీనివల్ల అమ్మకాలు కూడా జోరుగా ఊపందుకుంటున్నాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సంస్థ సీఈవో వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ ఇచ్చేందుకు కస్టమర్లు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేసి వయస్సు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒక వినియోగదారుడికి ఎంత మద్యం ఇవ్వాలనేదానిపై కూడా లిమిటేషన్ పెట్టడం జరిగింది. ఆ లిమిట్ దాటితే మద్యం ఇవ్వడానికి ఛాన్స్ లేదు.

Tags:    

Similar News