బంగారం ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. వరుసగా పై పైకి వెళుతూనే ఉన్నాయి. పైకెగాశాయి. అయితే, నిన్న భారీ పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గత వారంలో ఒక్క రోజు కిందకు దిగివచ్చిన బంగారం ధరలు మిగిలిన రోజుల్లో పెరుగుతూనే వచ్చాయి. ఈవారం కూడా అదే బాటలో ఉన్నాయి. దీంతో ఈరోజు (28.01.2020) కూడా బంగారం ధరలు పైచూపు చూశాయి.
స్వల్పంగా పెరిగిన బంగారం..
మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 130రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,100 నుంచి 42,230 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 130 రూపాయలు పెరగడంతో 38,630నుంచి 38,760 రూపాయల వద్దకు చేరుకుంది.
మోత మోగించిన వెండి ధరలు..
ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ వస్తుంటే.. వెండి ధరలు కూడా అదే విధంగా పై చూపులు చూస్తున్నాయి. నిన్న నిలకడగా ఉన్న వెండి ఈరోజు కేజీకి 400 రూపాయలు పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,200 రూపాయల నుంచి 49,600 రూపాయలకు చేరుకున్నాయి.
విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,230 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,760 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,600 రూపాయల వద్ద నిలిచింది.
దేశరాజధాని ఢిల్లీలోనూ..
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 140 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,800 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,600 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా మార్పులు లేకుండా ఉన్నాయి. దాంతో వెండి ధర కేజీకి 49,600 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును