మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి!

బంగారం ధరలు ఈరోజూ(27-11-2019) తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి.

Update: 2019-11-27 03:42 GMT
Today's Gold rates: Representational image

బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో తగ్గుదలను నమోదు చేశాయి. కాగా..వెండి ధరలు కూడా దిగివచ్చాయి. 27.11.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం ధరలతో పోలిస్తే 140 రూపాయలవరకూ తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 39,410 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయలు తగ్గి 36,130 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 46,300 రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,410 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,130 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా,ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గి 36,900 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీకి 100 రూపాయలు తగ్గి 46,300 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27.11.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News