శుభవార్త..స్వల్పంగా తగ్గిన బంగారం..భారీగా పడిపోయిన వెండి!
నిన్న ఒక్కసారిగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. అయితే, వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుదల నమోదు చేశాయి.
నిన్న ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కాగా..వెండి ధరలు భారీస్థాయిలో పడిపోయాయి. 21.11.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే 50 రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా కేజీకి 950 రూపాయల వరకూ దిగివచ్చాయి.
గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,860 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయలు తగ్గి 36,540 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 950 రూపాయలు తగ్గి 46,900 రూపాయలకు దిగివచ్చింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,860 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,540 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు స్వల్పంగా తరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గి 38,500 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తరుగుదల నమోదు చేసి 37,300 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 950 రూపాయలు తగ్గింది. దీంతో 46,900 రూపాయలకు పడిపోయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21.11.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.