స్వల్పంగా తగ్గిన బంగారం..వెండిదీ అదే దారి!
నిన్న భారీ పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు (06-12-2019) స్వల్పంగా తగ్గాయి.
నిన్న చుక్కలు చూపించిన బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఇదేబాట పట్టాయి. 06.12.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం ధరలతో పోలిస్తే 170 రూపాయలవరకూ తగ్గింది. వెండి ధరలు కేజీకి 100 రూపాయల వరకూ తగ్గాయి.
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170రూపాయలు తగ్గి 39,770 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170రూపాయలు తగ్గి 36,480 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 47,400 వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,770 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,480 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గాయి. దీంతో 38,450 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గడంతో 37,250 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 100 రూపాయల తరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయలకు చేరింది.