Gold Rate Today: బంగారం ఇప్పుడే కొనండి..భవిష్యత్తులో కొనుగోలు చేయడం కష్టం..అందనంత ఎత్తుకు బంగారం ధర
Gold Rate Today: బంగారం ధరలు పండగ వేల ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. పసిడి ధర తారాజువ్వల దూసుకెళ్లింది. తులం బంగారం ధర ఒక్కరోజులోనే 680 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులంతా హాహాకారాలు పెడుతున్నారు. అక్టోబర్ 30వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81560 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74550 రూపాయలుగా ఉంది.
ప్రస్తుతం ఈ రేటు వద్ద బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయిని సృష్టించింది. బంగారం ధర ఇక నెక్స్ట్ మైలురాయి లక్ష దిశగా పరుగులు పెట్టేందుకు దూసుకెళుతోంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర తగ్గినట్టే తగ్గి అంతకుమించిన రెట్టింపు వేగంతో పెరగడంతో ఇప్పుడు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
బంగారం ధర ఇంత వేగంగా పెరిగిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలను అన్వేషించేందుకు నిపుణులు సైతం ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు బంగారం ధరల పెరుగుదలకు ప్రత్యక్ష కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2800 డాలర్లకు పెరిగింది. అక్కడ బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయిని సృష్టించింది దీంతో మన దేశీయంగా కూడా బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
పసిడి ధరలు ఈ రేంజ్ లో భగ్గుమనడం చరిత్రలోనే తొలిసారి. అటు బంగారం పైన ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం పండగ చేసుకుంటున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 18 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధరలు ఇంత వేగంగా పెరుగుతాయని ఎవరు ఊహించలేదని నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో ఒక లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
2025వ సంవత్సరంలో ఇది జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.