స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి భారీ పతనం!

Update: 2020-04-22 01:29 GMT
Gold rate today in India (representational image)

బంగారం ధరలు నాలుగోరోజూ కిందికి దిగొచ్చాయి. ఈరోజు (ఏప్రిల్ 22) బంగారం ధరలు పది గ్రాములకు 30 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా కింది చూపులు చూశాయి. కేజీకి 1050 రూపాయల భారీ తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు కూడా కిందికి దిగొచ్చాయి. బుధవారం (22.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 30 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,400 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 20 రూపాయల తగ్గుదలతో 44,100 రూపాయలు నమోదు చేసింది.

భారీ షాకిచ్చిన వెండి ధరలు...

బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. నిన్న భారీ స్థాయిలో పెరుగుదల కనబరచిన వెండి ధర ఈరోజు దాదాపుగా అదే స్థాయిలో కేజీకి 1050 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,650 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 30 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,400 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 20 రూపాయల తగ్గుదలతో 44,100 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,650 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయల తగ్గుదలతో 44,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయల తరుగుదలతో 41,850 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి దిగొచ్చింది. కేజీ వెండి ధర 41,650 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News