ఈ వారంలో భారీగా తగ్గిన బంగారం ధరలు ఎంతంటే...

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా లేకుండా ఉండటం.. కరోనా వైరస్ ఎఫెక్ట్.. రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు ఈవారం అంతా బంగారం ధరలు పైకీ కిందికి కదులుతూ వచ్చాయి.

Update: 2020-03-01 02:23 GMT

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా లేకుండా ఉండటం.. కరోనా వైరస్  ఎఫెక్ట్.. రూపాయి మారకం విలువలో  ఒడిదుడుకులు ఈవారం  అంతా బంగారం ధరలు పైకీ కిందికి కదులుతూ వచ్చాయి.  అయితే, గత సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే ఆదివారం  నాటికి  బాగా తగ్గాయి.

గత వారం ప్రారంభ ధరతో పోలిస్తే వారాంతానికి బంగారం  1,030 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 1,230 రూపాయలు దిగి వచ్చింది. 

24 ఫిబ్రవరి సోమవారం 24 క్యారెట్లు 10 గ్రాములకు 44,700 రూపాయలు ఉన్న బంగారం ధర 1 మార్చి  ఆదివారం  43,670 రూపాయలకు పడిపోయింది.

ఇదే విధంగా 24 ఫిబ్రవరి సోమవారం 22 క్యారెట్లు 10 గ్రాములకు 41,000 రూపాయలు ఉన్న బంగారం ధర 1 మార్చి ఆదివారం 39,870 రూపాయలకు దిగివచ్చింది.

గత వారమంతా బంగారం ధరలు కదలాడుతూనే ఉన్నాయి. మంగళవారం..బుధవారం తగ్గుదల నమోదు చేసింది. గురువారం పైకెగసిన బంగారం ధరలు శుక్రవారం, శనివారం భారీగా కిందికి దిగొచ్చాయి.

వెల వెలబోయిన వెండి!

బంగారం తో పాటు వెండి ధరలు కూడా ఈవారంలో భారీ పతనాన్ని చూశాయి. కేజీ వెండి ధర  ఏకంగా 3,000 రూపాయలకు పైగా దిగొచ్చింది. 

24 ఫిబ్రవరి సోమవారం వెండి కేజీకి 51,500 రూపాయలుగా ఉన్న వెండి ధర 1 మార్చి ఆదివారం 48,500 రూపాయలకు పడిపోయింది.

మొత్తమ్మీద గత వారంలో బంగారం వెండి ధరలు నెమ్మదించాయి. మార్కెట్ లో వున్న అనిశ్చిత పరిస్థితులు బంగారం, వెండి ధరల పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిపై పెట్టుబడి పెట్టాలని  భావిస్తే పరిస్థితులు గమనించి ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తారు.


Tags:    

Similar News