Gold Rates Today: భారీగా పెరిగిన బంగారం.. అమాంతం తగ్గిన వెండి!
శుక్రవారం బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. బంగారం పదిగ్రాములకు దాదాపు 900 రూపాయలకు పైగా పెరిగింది. వెండి దానిని మించిన స్థాయిలో పతనమైంది. కేజీ వెండి 2300 రూపాయలు తగ్గింది. ఇలా బంగారం ధర పెరిగి.. వెండి ధర భారీగా తగ్గిపోయి మార్కెట్ కి షాకిచ్చాయి.
ఈరోజు బంగారం ధరలు పైకెగశాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా 910 రూపాయలు పెరిగి 39,580 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 910 రూపాయలు పెరిగి 36,360 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర బాగా తగ్గింది. ఏకంగా 2,300 వరకూ తగ్గి కేజీ వెండి ధర 45,750 రూపాయలకు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,950 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 37,150 రూపాయలకు చేరుకుంది. వెండి ధర 2300 రూపాయలు తగ్గి కేజే వెండి ధర 45,750 రూపాయలుగా ఉంది.