ఇంకొంచెం కిందికి దిగిన బంగారం ధరలు
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం కొంచెం తగ్గుదలను నమోదు చేశాయి. శుక్రవారం హైదరాబాద్.. ధిల్లీ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయలు తగ్గడంతో 39,040 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 320 రూపాయలు తగ్గి 35,790 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర రెండో రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 48,765 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 350 రూపాయలు తగ్గింది. ఇక్కడ 37,660 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 350 రూపాయలు తగ్గి 36,550 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 48,765 రూపాయలుగానే ఉంది.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం కొద్దిగా పైకి ఎగసింది. 0.18 శాతం పెరిగి 1,509 డాలర్లుగా ఉంది. ఇక వెండి కూడా 0.19 శాతం పెరిగి 17.91 డాలర్లకు చేరింది.